HomeతెలంగాణReal Estate: హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఇళ్ల అమ్మకాలు.. కారణం ఇదే !

Real Estate: హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఇళ్ల అమ్మకాలు.. కారణం ఇదే !

Real Estate : దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఒకప్పుడు జోరుగా సాగిన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మళ్లీ కుప్పకూలుతోంది. ప్రస్తుత సంవత్సరం అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇళ్ల అమ్మకాలపై ఇటీవల విడుదలైన నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన తాజా గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 21 శాతం తగ్గాయని చెబుతున్నారు. ఢిల్లీ NCR, ముంబై, నవీ ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణే, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో 1.08 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,37,225 యూనిట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఢిల్లీ NCRలో మాత్రమే అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. ఇళ్ల అమ్మకాలు పడిపోయిన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.

అక్టోబర్ – డిసెంబర్ మధ్య తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేవలం 12,682 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 24,044 యూనిట్ల నుండి 47 శాతం తగ్గుదలగా చెప్పొచ్చు. అలాగే సిలికాన్ సిటీ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. చెన్నైలో 9 శాతం తగ్గాయి. బేస్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గాయని ప్రాప్ ఈక్విటీ సీఈఓ, వ్యవస్థాపకుడు సమీర్ జసుజా అన్నారు. పండుగ సీజన్ కారణంగా మూడవ త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో అమ్మకాలు పెరిగాయని ఆయన అన్నారు. ఐతే నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పోలిస్తే రెడీమేడ్ ఇళ్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో బిల్డర్లు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇల్లు కొనాలనే తమ కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అలాంటి వారికి బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. చెల్లింపులు చేయడంలో కూడా వారు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు 47శాతం తగ్గొచ్చని అంచనా వేసింది. 2023–24 డిసెంబర్‌ త్రైమాసికంలో 24,044 ఇళ్ల అమ్మకాలు జరిగితే ప్రస్తుత ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం మేర శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు. కోల్‌కతాలో అమ్మకాలు 33శాతం తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు తగ్గిపోవచ్చు. ముంబైలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27శాతం పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13శాతం విక్రయాలు తగ్గే ఛాన్స్ ఉంది. కాగా 2023–24 డిసెంబర్‌ త్రైమాసికంలో 8,607 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 7,478 గృహాలకు పరిమితం కావచ్చు. పుణేలో ఇళ్ల అమ్మకాలు 24 శాతం తగ్గే చాన్స్‌ ఉంది. ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ కారణంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో గురుగ్రాం పరిధిలో లగ్జరీ ఇళ్లకు కొన్నేళ్లుగా డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య 12,915 ఇళ్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే 25శాతం అమ్మకాలు పుంజుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular