spot_img
HomeతెలంగాణRamagundam: రామగుండం... ఎవరికి గండం..

Ramagundam: రామగుండం… ఎవరికి గండం..

Ramagundam: తెలంగాణలో కీలక మున్సిపాలిటీల్లో రామగుండం ఒకటి. ఇక్కడ ఎప్పుడు ఎన్నికల్లో విలక్షణ తీర్పు వస్తుంది. మినీ ఇండియాగా గుర్తింపు పొందిన ఎన్టీపీసీ ఇక్కడే ఉంది. అన్నివర్గాల ఓటర్లు ఇక్కడే ఉంటారు. గ్రామ, పట్టణ, పారిశ్రామిక ప్రాంతం కలగలిపిన రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. పదేళ్లు ఇక్కడ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. ఫిబ్రవరి 11న జరగనున్నాయి. 198 గ్రామాల విలీనంతో ఓటర్ల సంఖ్య 1.90 లక్షలకు పెరిగింది. ఎన్టీపీసీ, సింగరేణి పారిశ్రమిక క్లస్టర్ల కారణంగా ఈ ప్రాంతంలో యువత, కార్మికులు ఎక్కువ. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్‌ స్థానిక సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతు సేకరించుకుంది. 2020 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యంతో మేయర్‌ స్థానం దక్కించుకున్నా, రాష్ట్ర స్థాయి మార్పులతో ఇప్పుడు పరిస్థితి మారింది.

కాంగ్రెస్‌కు ఎడ్జ్‌..
ఈసారి రామగుండం హస్తగతం అవుతుందని అంచనా. సర్వేల ప్రకారం.. కాంగ్రెస్‌ 35–45 డివిజన్లలో విజయాన్ని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం, ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, రేషన్‌ కార్డుల పంపిణీలు. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, మంత్రి శ్రీధర్‌బాబు రామగుండం హస్తగతం కావడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు.

రెండో స్థానంలో బీజేపీ..
బీజేపీ ఈసాగి బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనను చూసిన ప్రజలు ఈసారి బీజేపీవైపు కూడా చూస్తున్నారు. దీంతో బీజేపీ ఈ ఎన్నికల్లో 12 నుంచి 18 కార్పొరేషన్లలో మలమైన పోటీ ఇస్తుంది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రచారం చేస్తున్నారు. అది బీజేపీకి ప్లస్‌ పాయింట్‌. కందుల సంధ్యారాణి కూడా కీలకంగా ఉన్నారు.

మూడో స్థానానికే బీఆర్‌ఎస్‌..
గత అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ బలహీనపడింది. 4–7 డివిజన్లలో మాత్రమే పోటీ ప్రభావవంతంగా ఉంటుంది. భూ కబ్జాలు, గుండాగీరి ఆరోపణలు ప్రజల మనసుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌సీఐలో ఉద్యోగాల పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన చీటింగ్‌తో చాలా మంది మోసపోయారు. దీంతో బీఆర్‌ఎస్‌పై పూర్తిగా వ్యతిరేకత ఉంది. సింగరేణిలో కూడా టీబీజీకేఎస్‌ గుర్తింపు హోదా కోల్పోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular