Rajiv Yuva Vikasam Scheme
Rajiv Yuva Vikasam : తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాల ను స్పీడ్ చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తోంది. వీటిలో ఇప్పటివరకు ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రారంభించింది. అయితే యువత అభివృద్ధి లక్ష్యంగా.. వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాస్’ అనే పథకాన్ని ప్రారంభించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి.. వాటిలో సబ్సిడీని అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం? ఎలా దీన్ని అప్లై చేయాలి?
Also Read : చెరో పదేళ్లు అధికారం.. కేటీఆర్ తో అసెంబ్లీలో కోమటిరెడ్డి డీల్!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తులను తహసిల్దార్ కార్యాలయంలో ఇప్పటికే స్వీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత కు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను అందించింది. వీటి ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు వార్షిక ఆదాయంను రూ 1,50,000లను కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 వార్షికాదాయాన్ని కలిగి ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం, వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వార్నబుల్ గ్రూపు సర్టిఫికెట్లు ఉంచాల్సి ఉంటుంది. కుటుంబంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ లేదా బీసీ కమిషన్ ద్వారా రుణాన్ని పొందగలిగిన వారైతే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అంతేకాకుండా ఒకే కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇరవై ఒక్క ఏళ్ల నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్నవారు ఈ పథకం లబ్ధి పొందడానికి అర్హులు. అలాగే వ్యవసాయం దాని అనుబంధం రంగాలకు చెందిన వారికి 60 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజీవ్ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు https://pgo bmms.cgg.gov.in అనే పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పై అవగాహన లేని వారు సమీప మీసేవ కేంద్రాల్లోకి వెళ్లాలి. ఏప్రిల్ 5 వరకు ఈ దరఖాస్తులను స్వీకరించి మే 31వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారు.
దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. వీరు ఎంపిక చేసిన లబ్ధిదారులను జూన్ రెండవ తేదీన మంజూరు అత్తలను అందజేస్తారు. ఇలా జూన్ 9 వరకు ఈ పత్రాలను అందజేస్తారు. గ్రామాల వారు మండల స్థాయిలో అధికారుల నుంచి ఈ పత్రాలను పొందవలసి ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4200 మందికి లబ్ధి చేకూరి అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read : నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో.. కేటీఆర్ పై కేసు నమోదు.. ఎందుకంటే….