Phone Tapping case : పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రత్యర్థుల ఎత్తులు తెలసుకునేందుకు విపక్ష నేతలతోపాటు, వ్యాపారులు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ విషయం బయటకు వచ్చింది. హార్డ్ డిస్క్‌లు ధ్వసం చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కొందరు జైల్లో ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు ఇండియాకు వస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కానీ, తాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ వచ్చిన ప్రభాకర్‌రావు. అనూహ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. దీంతో పోలీస్‌లు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్ర హోం శాఖ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు నిలిపివేసింది. దీంతో అతని గ్రీన్‌కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.
ప్రభాకర్‌రావు పిటిషన్..
భారత పాస్‌పోర్టు రద్దు అయిన నేపథ్యంలో ప్రభాకర్‌రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఇండియాలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని తన కుమారుడి వద్ద ఉంటున్నానని వెల్లడించారు. ఇదే కేసులో నిందితుడిగాఉన్న శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విచారణకు అనుమతి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును విచారణ చేసేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి కూడా ఇచ్చింది. ఈ తరుణంలోనే ప్రభాకర్‌రావు అమెరికాలో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును విచారణ చేసేందకు కూడా అనుమతి ఇచ్చింది. వీరిద్దరూ రిటైర్డ్ అధికారులు, ఇక మరో ముగ్గురు కీలక నిందితులు అయిన ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న సర్వీస్‌లో ఉన్నారు.
రెడ్ కార్నర్ నోటీసులు..
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును ఇండియాకు రప్పించేందకు సీఐడీ ఇంటర్‌పోల్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. వారు వస్తే గుట్టు వీడే అవకాశం ఉంది. అందుకే వారు రాకుండా అక్కడే ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.