https://oktelugu.com/

 Nizamabad : మీరు కింగ్స్‌ అయితే.. మేము క్వీన్స్‌.. పేకాటలో తగ్గేదేలే అంటున్న మహిళామణులు!

సాధారణంగా పేకాటరాయుళ్ల అరెస్టు అనే వార్తలు మనకు పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో కనిపిస్తుంటాయి. కానీ పేకాటరాణుల అరెస్టు అరుదుగా వింటుంటాం.. ఇప్పుడు వాళ్లు కూడా మీరు కింగ్స్‌ అయితే మేమే క్వీన్స్‌ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 27, 2024 / 11:23 AM IST

    Nizamabad

    Follow us on

    Nizamabad : పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. నిత్యం ఏదో ఒక జిల్లాలో కనిపించే వార్త. అయితే పేకాట ఆడేవారికి చట్టంలో కఠిన శిక్షలు లేవు. దీంతో జరిమానా కట్టి బయటకు వచ్చి.. మళ్లీ ఆడుతున్నారు. రోజు కూలీ నుంచి బిగ్‌షాట్స్‌ వరకు అందరూ పేకాడుతున్నారు. అయితే పురుషులేనా ఆడేది.. మహిళలు ఆడకూడదా అన్నట్లు తయారవుతున్నారు. అయితే వీళ్లలో పేకాడేది మాత్రం బిగ్‌ షాట్స్‌ మాత్రమే. సరదా కోసం మొదలు పెట్టి… డబ్బులు పెట్టి బెట్టింగ్‌లకు దిగే స్థాయికి ఎదిగారు. కిట్టీ పార్టీల పేరుతో మీటింగ్‌లు పెట్టుకుంటున్న మహిళలు ఎంజాయ్‌మెంట్‌.. ఒత్తిడి దూరం పేరుతో పేకాటలోనూ నైపుణ్యం పెంచుకుంటున్నారు. తాజాగా నిజామామాద్‌లో ఆస్పత్రినే పేకాట క్లబ్‌గా మార్చి.. తమ హస్తకళానైపుణ్యం ప్రదర్శించారు మహిళలు. పురుషులతో తామూ సమానమే అన్నట్లుగా బెంట్టింగ్‌లు పెట్టిమరీ పేకాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రిపై రైడ్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఆస్పత్రి నాలుగో అంతస్తులో అడ్డా..
    జూదం అనేది ఓ వ్యసనం. దానికి బానిసై ఎంతో మంది ఆస్తులు అమ్మున్నారు. చివరకు భార్య తాళిబొట్టు అమ్మిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక పేకాటకు బానిసైన వారు చాలా మంది తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. మన దేశంలో పేకాట సరదాగా ఆడుకోవచ్చు. డబ్బులతో ఆడడం నేరం. ఈ ఆటను ఎక్కువగా పురుషులే ఆడతారు. నిజామాబాద్‌ సరస్వతీ నగర్లో మాత్రం డాక్టర్ల భార్యలు పేకాడుతూ పట్టుపడ్డారు. ఏకంగా ఆస్పత్రి నాలుగో అంతస్తునే పేకాట క్లబ్‌గా మార్చేశారు. బెట్టింగ్‌లు పెట్టి మరీ పేకాడుతున్నారు. పక్కా సమాచారం మేరకు బుధవారం(సెప్టెంబర్‌ 25న) వన్‌టౌన్‌ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే పేర్లు మాత్రం వెల్లడించలేదు.

    అందరూ బిషాట్స్‌ భార్యలే..
    ఇక పట్టుబడిన మహిళలంతా పేరు ప్రఖ్యాతలు ఉన్న, ధనవంతులైన డాక్టర్ల భార్యలే అని తెలుస్తోంది. ఈమేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా, మహిళలు పేకాడుతూ పట్టుపడడం నిజామాబాద్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. పురుషుల తరహాలోనే డబ్బులు పెట్టి మరీ పేకాడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చాలాకాలంగా వీరు పేకాట ఆడుతున్నారని, చివరకు పక్కా సమాచారంతో పట్టుపడ్డారని తెలుస్తోంది.