https://oktelugu.com/

PK team: తెలంగాణలో పని మొదలుపెట్టిన పీకే టీం?

PK team:ప్రత్యర్థి పార్టీలను ఊహించని విధంగా దెబ్బ కొట్టడంలో కేసీఆర్ ను మించి నాయకుడు మరొకరు లేరని రాజకీయాల్లో టాక్ ఉంది. ఇతర పార్టీల బలహీనతలను అవకాశంగా మలుచుకొని కేసీఆర్ తన బలాన్ని పెంచుకుంటారని అందరికీ తెల్సిందే. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు మూడోసారి అధికారంలో రావాలని ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో సహజంగానే ఆపార్టీపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. వీటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2022 11:19 am
    Follow us on

    PK team:ప్రత్యర్థి పార్టీలను ఊహించని విధంగా దెబ్బ కొట్టడంలో కేసీఆర్ ను మించి నాయకుడు మరొకరు లేరని రాజకీయాల్లో టాక్ ఉంది. ఇతర పార్టీల బలహీనతలను అవకాశంగా మలుచుకొని కేసీఆర్ తన బలాన్ని పెంచుకుంటారని అందరికీ తెల్సిందే. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు మూడోసారి అధికారంలో రావాలని ప్రయత్నాలు చేస్తోంది.

    టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో సహజంగానే ఆపార్టీపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. వీటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆపార్టీ నేతలు ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    ఈ విషయంలో సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీకే టీం తెలంగాణలోకి రంగంలోకి దిగి తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పీకే టీంతో ఓ అంతర్గత సర్వే కూడా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే ఆధారంగానే ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ సలహాలు ఇస్తున్నారని సమాచారం.

    పీకే సలహాతోనే కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడే కేసీఆర్ ఇటీవల కేంద్ర బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ కొన్ని విషయాల్లో గీత దాటరన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఆ అంశంపై చర్చ జరుగాలని ఆయన కోరడం, ఆ తర్వాతి పరిణామాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి.

    కేసీఆర్ వ్యాఖ్యలను సొత పార్టీ నేతలు సమర్థిస్తుండగా వ్యతిరేకించేవారు విమర్శలు గుప్పిస్తారు. ఈక్రమంలోనే సమాజంలోని కొన్ని వర్గాల్లో చీలిక వచ్చే అవకాశం ఉండనుంది. గతంలో ఏపీలో ఓ కులంపై వ్యతిరేకతను ప్రజల్లో ఎలా అయితే రెచ్చగొట్టారో ఇప్పుడు తెలంగాణలోనూ ఆ స్థానంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోంది.

    సమాజంలో ఏ అంశానికి కూడా వందశాతం అనుకూలత ఉండదు. దీనినే ద్వారానే సమాజంలో చీలికలు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని పీకే ప్లాన్ చేస్తుంటారు. ఈ ఫార్మూలానే ప్రస్తుతం తెలంగాణలో పీకే టీం అమల్లోకి తీసుకొస్తోంది. పీకే సలహాలతోనే సీఎం కేసీఆర్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది. ఇదంతా పీకే వ్యూహంలో భాగమనేని, రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా మరిన్ని అలజడులు ఖాయమనే ప్రచారం జరుగతోంది.