https://oktelugu.com/

తెలంగాణలోని ఆ ప్రాంతంలో పందుల పోటీలు.. ఫ్రైజ్ మనీ ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పలు జిల్లాల్లో కోళ్ల పందేలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అయిజ లో మాత్రం ప్రతి సంవత్సరం పందుల పోటీలు జరుగుతాయి. కుస్తీ పోటీలకు ఏ మాత్రం తీసుపోకుండా ఈ పోటీలు జరుగుతాయి. జనం గుంపులుగా గుమికూడి ఈ పోటీలను చూస్తారు. పందులతో పాటు ఇక్కడ కుక్కల పోటీలు కూడా జరుగుతాయి. గెలిచిన పంది యజమానికి భారీ మొత్తం ఫ్రైజ్ మనీ […]

Written By: , Updated On : March 6, 2021 / 06:07 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పలు జిల్లాల్లో కోళ్ల పందేలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అయిజ లో మాత్రం ప్రతి సంవత్సరం పందుల పోటీలు జరుగుతాయి. కుస్తీ పోటీలకు ఏ మాత్రం తీసుపోకుండా ఈ పోటీలు జరుగుతాయి. జనం గుంపులుగా గుమికూడి ఈ పోటీలను చూస్తారు. పందులతో పాటు ఇక్కడ కుక్కల పోటీలు కూడా జరుగుతాయి. గెలిచిన పంది యజమానికి భారీ మొత్తం ఫ్రైజ్ మనీ కూడా ఇస్తారు.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ప్రతి సంవత్సరం శ్రీతిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది శ్రీతిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మార్చి నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఇక్కడ పెంపుడు జంతువుల ప్రదర్శన పోటీలు జరుగుతాయి. ఈ పోటీల కోసం ఇతర రాష్ట్రాల నుంచి పందులు, కుక్కలను తీసుకొస్తున్నారు.

పందులు ఒకదానితో మరొకటి తలపడుతుంటే ఆడియన్స్ కేరింతలు కొడుతూ చేసే సందడి అంతాఇంతా కాదు. నిర్వాహకులు ఇక్కడికి వచ్చే వారికి కోసం ఏర్పాట్లు చేయడంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కోసం భోజనాలను కూడా ఏర్పాట్లు చేస్తారు. ఈ పోటీల కోసం పందులకు ఉలువలు, జొన్నలు వంటి బలమైన ఆహారం ఇస్తామని రోజుకు పంది ఆహారం కోసం 500 రూపాయలు ఖర్చు చేస్తామని పందుల యజమానులు చెబుతున్నారు.

ఈ పోటీలలో పాల్గొనే పందులకు ట్రైనింగ్, ఫిట్నెస్‌ ఇవ్వడంతో పాటు . డైలీ వాకింగ్‌ కూడా చేయిస్తామని పందుల యజమానులు చెబుతున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇక్కడ పందుల పోటీలు జరుగుతున్నాయని సమాచారం. ప్రథమ బహుమతి పొందిన పంది యజమానికి ఏకంగా 30,016 లభిస్తుంది.