https://oktelugu.com/

పిచ్చి పీక్స్: బాలయ్యతో కొట్టించుకోవడం గర్వంగా ఉందట..

అంత కోపంతో.. సినిమాల్లో విలన్లను కొట్టినట్టు కొట్టినా కూడా బాలయ్య అభిమానిలో కాసింత కూడా ఆగ్రహం కలుగలేదంటే అతడు ఉప్పు కారం తింటున్నాడా? అన్న సెటైర్లు పడుతున్నాయి. అయినా బాలయ్యను అమితంగా అభిమానించే ఆ అభిమాని తనను కొట్టినందుకు.. బాలయ్య చేతి తగిలినందుకు గర్వంగా ఉందనడం విశేషం. కొట్టించుకోవడం గర్వంగా ఉందన్న బాలయ్య అభిమాని మాటలు తాజాగా వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి బాలయ్యపై చెలరేగుతున్న దుమారాన్ని టీడీపీ నేతలు చల్లార్చినట్టు తెలుస్తోంది. బాలయ్య చేతిలో దెబ్బలుతిన్న […]

Written By: , Updated On : March 6, 2021 / 06:09 PM IST
Follow us on

అంత కోపంతో.. సినిమాల్లో విలన్లను కొట్టినట్టు కొట్టినా కూడా బాలయ్య అభిమానిలో కాసింత కూడా ఆగ్రహం కలుగలేదంటే అతడు ఉప్పు కారం తింటున్నాడా? అన్న సెటైర్లు పడుతున్నాయి. అయినా బాలయ్యను అమితంగా అభిమానించే ఆ అభిమాని తనను కొట్టినందుకు.. బాలయ్య చేతి తగిలినందుకు గర్వంగా ఉందనడం విశేషం.

కొట్టించుకోవడం గర్వంగా ఉందన్న బాలయ్య అభిమాని మాటలు తాజాగా వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి బాలయ్యపై చెలరేగుతున్న దుమారాన్ని టీడీపీ నేతలు చల్లార్చినట్టు తెలుస్తోంది. బాలయ్య చేతిలో దెబ్బలుతిన్న అభిమానితో ఓ రిలీజ్ చేశారు.

అందులో బాలయ్య అభిమాని హాట్ కామెంట్స్ చేశారు. ‘‘బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న అభిమాని సోము తాజాగా స్పందించాడు. ‘బాలయ్య టచ్ చేసినందుకు గర్వంగా ఉందని.. ప్రచారంలో బాలయ్య ఎవ్వరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని.. అలాంటిది నన్ను టచ్ చేశాడని సోము పేర్కొనడం విశేషం. మా అన్నయ్య ఇంటికి వచ్చిన బాలయ్య.. నన్ను బయటి వ్యక్తి అనుకొని పక్కకు తోసేశాడని.. ఇలాంటి వాటిని మేము పట్టించుకోం’’ అని ఆ అభిమాని ఓ వీడియో రిలీజ్ చేశాడు.

అయితే  ఎవరో రాసిస్తే ఆ స్క్రిప్ట్ ను కిందకు చూస్తూ చదివినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అంటే అతడు స్వచ్ఛందంగా ఈ వీడియో చేయలేదని.. ఎవరో వెనుకాల ఉండి చేయించారని తెలుస్తోంది.

ఇలా అసలే ఉగ్ర నరసింహాలా ఆవేశంతో రెచ్చిపోవడాన్ని బాలయ్య తగ్గించుకోవడం లేదు. ఇప్పటికే ఆ ఆవేశంలో అసిస్టెంట్లను అభిమానుల చెంపలు చాలానే వాయించాడు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈరోజు కూడా వాయించాడు. ఇన్ని సార్లు వాయించినా బాలయ్యపై పిచ్చి ప్రేమతో అభిమానులు దెబ్బలు తింటున్నారే కానీ ఆయనపై కేసులు పెట్టకపోవడం విశేషమనే చెప్పాలి.

ఆ పదం అన్నందుకే బాలయ్య నన్ను కొట్టాడు | Fan Gave Clarity on Balakrishna Slaps | Ok Telugu