https://oktelugu.com/

హనుమంతుడికి తులసి మాల సమర్పిస్తే..?

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి మనందరికీ తెలిసినదే. హనుమంతుడు అనగానే ఎంతో బలవంతుడు, ధైర్యశాలి అనే విషయాలు గుర్తుకు వస్తాయి. రాముడికి నమ్మినబంటుగా ఉన్న హనుమంతుడుని పూజిస్తే వారి కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే హనుమంతుడికి ఏ రోజు పూజ చేయాలి? ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా హనుమంతుని ప్రతిరోజు పూజించవచ్చు. ముఖ్యంగా స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన శనివారం పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 6, 2021 / 06:03 PM IST
    Follow us on

    రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి మనందరికీ తెలిసినదే. హనుమంతుడు అనగానే ఎంతో బలవంతుడు, ధైర్యశాలి అనే విషయాలు గుర్తుకు వస్తాయి. రాముడికి నమ్మినబంటుగా ఉన్న హనుమంతుడుని పూజిస్తే వారి కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే హనుమంతుడికి ఏ రోజు పూజ చేయాలి? ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    సాధారణంగా హనుమంతుని ప్రతిరోజు పూజించవచ్చు. ముఖ్యంగా స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన శనివారం పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. వాయి పుత్రుడైన ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అదే విధంగా వివాహంలో ఏర్పడ్డ అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆంజనేయుడికి తులసి మాలను సమర్పించి పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

    శ్రీరామజయం అని రాసి హనుమంతుడికి మాలగా సమర్పించడంవల్ల మనం చేసే పనిలో విజయం కలుగుతుంది. స్వామివారిని పూజించడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు నుంచి విముక్తి పొందవచ్చు. ఇలాంటి దోషాలను ఎదుర్కొంటున్న వారు ముఖ్యంగా స్వామి వారిని బుధ, గురు, శని వారాలలో తప్పకుండా ప్రత్యేక పూజలతో పూజించడం వల్ల మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, ఎర్రటి పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా ఎరుపు రంగు నైవేద్యం స్వామివారికి పెట్టడం వల్ల స్వామివారు ప్రీతి చెంది అనుకున్న కోరికలను నెరవేరుస్తారు.