Phone Tapping Case : తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రముఖులు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది. 2023 ఎన్నికల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు అయిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు అమెరికా పారిపోయాడు. అతడిని రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చేసిన అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రావడంతోనే ఎయిర్‌పోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను బౌన్సర్లు అడ్డుకున్నారు. కొందరు విలేకరులపై భౌతిక దాడికి కూడా చేశారు. ఈ ఘటనలో మీడియా సిబ్బందికి స్వల్ప గాయాలు కూడా అయినట్లు సమాచారం. ఈ హంగామాతో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
Also Read : డ్వాక్రా మహిళల పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం…ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్ష…
70 మంది అనుచరులతో భారీ కాన్వాయ్
ప్రభాకర్ రావు ఎయిర్‌పోర్టు నుంచి తన నివాసానికి చేరుకునేందుకు దాదాపు 70 మంది అనుచరులు, బౌన్సర్లతో కూడిన భారీ కాన్వాయ్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ కాన్వాయ్‌లో లగ్జరీ కార్లు, భద్రతా సిబ్బంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ షో ఆఫ్ ద్వారా ఆయన తన ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మీడియాతో మాట్లాడని ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు నిరాకరించారు. నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ముఖం చాటేసి, ఎలాంటి ప్రకటన చేయకుండా ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారు. ఈ వైఖరి ఆయనపై మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యం
ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత ఆయన అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ కేసు సంబంధించి ఆయన నేడు విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం.
స్థానికుల ఆగ్రహం
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపై దాడి, ఎయిర్‌పోర్టులో హంగామా సృష్టించిన బౌన్సర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్థానికంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది, ముఖ్యంగా మీడియా స్వేచ్ఛపై దాడి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో చర్చ
సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్ రావు బౌన్సర్ల ఈ చర్యను పలువురు ఖండిస్తూ, ఇది చట్టవిరుద్ధమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తూ, ఫోన్ ట్యాపింగ్ కేసును మరుగునపరిచే ప్రయత్నంగా భావిస్తున్నారు.
సంచలన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఎయిర్‌పోర్టు ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, మీడియాపై దాడి, బౌన్సర్ల హంగామా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసాయి.
ఎయిర్‌పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్ల హంగామా..!
మీడియా ప్రతినిధులపై ప్రభాకర్ రావు బౌన్సర్లు దాడికి పాల్పడినట్లు సమాచారం
దాదాపు 70 మంది ప్రభాకర్ రావు అనుచరులు ఒక్కసారిగా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షం
ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో కాన్వాయ్
మీడియాతో మాట్లాడడానికి ముఖం చాటేసిన… https://t.co/9q0csFjSXo pic.twitter.com/5Lisc6NYC3
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2025