Pawan Kalyan Kondagattu: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ పూజ చేసిన తర్వాతనే ప్రారంభిస్తారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్లారు. అంతకు ముందు జనసేన ప్రచార రథం వారాహికి కొండగట్టులో వాహన పూజ చేయించారు. తాజాగా రూ.35 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శకుస్థాపన చేసేందుకు కొండగట్టుకు వచ్చారు.
96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని శనివారం దర్శించుకున్నారు. రూ.35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపానికి భూమిపూజ చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తుల అవసరాలను తీర్చే ఈ చర్య ఆలయ పరిసరాల్లో మార్పు తీసుకువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంజన్న అనుగ్రహంతోనే..
ఇక పవన్ కళ్యాణ్ గతంలో ఇక్కడికి వచ్చిని ఆంజనేయస్వామిని దర్శించుకుని వెళ్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. వాహనంపై నిలబడి అభివాదం చేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలింది. ఆ ప్రమాదం నుంచి పవన్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ విషయాన్ని తాజాగా పవన్ గుర్తు చేసుకున్నారు. అంజన్న అనుగ్రహంతోనే తాను విద్యుత్ ప్రమాదం నుంచి బయట పడ్డానని, కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిన పవిత్ర స్థలం అని తెలిపారు. భక్తుల విన్నపం మేరకు టీటీడీ, తెలంగాణ నాయకుల సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు.
టీటీడీ చైర్మన్ హాజరు..
ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరయ్యారు. పవన్ చొరవ ఆంధ్ర–తెలంగాణ మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం అతుతుంది. భక్తులకు మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి.