Top 10 Cars Sold In India February 2026: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. సొంత అవసరాలతో పాటు కార్యాలయాల అవసరాల కోసం ఫోర్ వెహికిల్ ఉండాలని కోరుకుంటున్నారు. కంపెనీలు సైతం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా 2026 ఏడాదిలో ఫిబ్రవరి నెలలో మొత్తం 1,70,127 కార్లు అమ్మకాలు జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2025 సంవత్సరం ఇదే నెలలో 1,56,425 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతంలో కంటే ఇప్పుడు 8.76% కార్ల విక్రయాలు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరిలో అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న ఉన్న టాప్ 10 కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
2026 ఫిబ్రవరి నెలలో అత్యధికంగా సేల్స్ జరుపుకున్న కార్లలో Tata కంపెనీకి చెందిన Nexon మొదటి స్థానంలో నిలిచింది. ఈ కారు పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లతో సహా మొత్తం 19430 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. గత సంవత్సరంతో ఇదే నెలలో 15349 కార్లను కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 26.59 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి కంపెనీకి చెందిన డిజైర్ 19326 కార్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది.టాటా కంపెనీకి చెందిన Punch 18,748 విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు 28.77 వృద్ధి సాధించింది. ప్రముఖ కార్ల కంపెనీ Hyundai నుంచి క్రెటా మోడల్ ఫిబ్రవరి నెలలో 17938 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మారుతి కంపెనీకి చెందిన brezza 17863 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో 16.05% వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది.
Maruti Suzuki కంపెనీకి చెందిన 7 సీటర్ కారు Ertigaa 17,807 యూనిట్ల అమ్మకాలతో ఆరస్థానంలో నిలిచింది. ఇదే కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ మరోసారి టాప్ టెన్ లిస్టులో ఏడవ స్థానంలో నమోదయింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారును 14,888 మంది కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25.12% తగ్గుదలను తెలుపుతోంది. అలాగే ఇదే కంపెనీకి చెందిన స్విఫ్ట్ కారు 14,833 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ కారు గత సంవత్సరంతో పోలిస్తే 8.83% తగ్గుదలను సూచిస్తుంది. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో 14,665 యూనిట్లతో 9వ స్థానంలో నిలిచింది. బాలేనో కారును ఫిబ్రవరి నెలలో 14,632 మంది కొనుగోలు చేయడంతో పదో స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.69 వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే టాప్ లెవల్లో టాటా కంపెనీకి చెందిన కార్లు ఉండగా.. ఎక్కువ శాతం మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లను ఫిబ్రవరి నెలలో ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో అత్యధిక డిమాండ్ ఉన్న వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్లు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు తగ్గినట్లు సూచిస్తుంది.