https://oktelugu.com/

Ganesh idol immersion: హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనానికి బ్రేక్.. హైకోర్టు సంచలన ఉత్తర్వులు

దశాబ్దాలుగా హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో జరుపుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా పర్యావణ వేత్తలు నిమజ్జనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 25, 2023 / 06:35 PM IST
    Follow us on

    Ganesh idol immersion: గణపతి నవరాత్రి ఉత్సవాలు తుది దశకు చేరాయి. ఇప్పటికే కొన్ని మండపాల నిర్వాహకులు నిమజ్జనాలు చేస్తున్నారు. ఈనెల 27 నుంచి దాదాపుగా అన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా నిమజ్జనం కొనసాగుతుంది. రాష్ట్రంలో అన్ని విగ్రహాల నిమజ్జనం ఒక ఎత్తయితే.. హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం మరో ఎత్తు. ఎక్కడ నిమజ్జనం చేయాలనే విషయంపై ఏటా సందిగ్ధం నెలకొంటుంది. ఏటా ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా కోర్టును ఆశ్రయించగా సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

    మట్టి విగ్రహాలకే అనుమతి..
    దశాబ్దాలుగా హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో జరుపుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా పర్యావణ వేత్తలు నిమజ్జనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాలకు విన్నవించినా స్పందించలేదు. దీంతో చివరకు కోర్టు ద్వారా నిమజ్జనానికి బ్రేక్‌ వేశారు. దీంతో ఉత్సవ సమితులు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలను అనుమతించొద్దని స్పష్టం చేసింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది.

    నిషేధం ఎత్తివేతకు నిరాకరణ..
    హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ జోన్‌ నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ వేసిన ఈ పిటిషన్‌లో గతేడాది పీఓపీతో చేసిన వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తగిన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిటిషన్‌ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలిక పాండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.