New Emergency Number Telangana: అత్యవసర సేవల కోసం 100, 101, 108 లాంటి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ సేవలు ఇంటి నుంచే పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఏపీ ఫ్రభుత్వం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త టోల్‌ప్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలను సమగ్రంగా, వేగవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకీకృత అత్యవసర నంబర్ 112 అమల్లోకి వచ్చింది. ఈ నంబర్ ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళలు, పిల్లల భద్రత, విపత్తు నిర్వహణ వంటి అన్ని రకాల అత్యవసర సేవలను ఒకే చోట పొందవచ్చు.
సేవలు ఒకే గొడుగు కిందకు..
గతంలో పోలీసు (100), అగ్నిమాపక సేవలు (101), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181), చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), విపత్తు నిర్వహణ (1077) వంటి విభిన్న నంబర్ల ద్వారా అత్యవసర సేవలు అందేవి. ఈ విభిన్న నంబర్లు ప్రజల్లో అయోమయాన్ని సృష్టించేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) కింద 112 నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్ ద్వారా అన్ని అత్యవసర సేవలను 24X7 అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TSICCC) నుంచి ఈ సేవలను సమన్వయం చేస్తారు.
సాంకేతికతతో వేగవంతమైన సేవలు
112 నంబర్‌కు కాల్ చేయగానే, GPS ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా కాలర్ లొకేషన్‌ను తక్షణమే గుర్తిస్తారు. దీని ద్వారా సమీపంలోని పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ లేదా ఇతర సేవలను వేగంగా పంపిస్తారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పవర్ బటన్‌ను మూడు సార్లు వేగంగా నొక్కితే లేదా సాధారణ ఫోన్‌లలో 5 లేదా 9 కీని ఎక్కువసేపు నొక్కితే పానిక్ కాల్ యాక్టివేట్ అవుతుంది. అదనంగా, 112 ఇండియా మొబైల్ యాప్ ద్వారా కూడా అత్యవసర సేవలను పొందవచ్చు, ఇందులో మహిళలు మరియు పిల్లల కోసం ‘SHOUT* ఫీచర్ అందుబాటులో ఉంది, ఇది సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లకు అలర్ట్ పంపుతుంది.
Also Read: Telangana Cabinet Expansion: తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణ: కొత్త మంత్రులుగా వీరే..
112 నంబర్ ప్రయోజనాలు..
సమన్వయం: బహుళ శాఖల (పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్) మధ్య సమన్వయంతో వేగవంతమైన స్పందన.
సౌలభ్యం: ఒకే నంబర్ ద్వారా అన్ని సేవలు, అయోమయాన్ని తగ్గిస్తుంది.
సాంకేతికత: GPS ట్రాకింగ్, పానిక్ బటన్, మరియు 112 ఇండియా యాప్ వంటి ఆధునిక సాంకేతికతలు సేవలను సులభతరం చేస్తాయి.
మహిళలు, పిల్లల భద్రత: SHE టీమ్స్, భరోసా సెంటర్లతో ఏకీకరణ ద్వారా మహిళలు, పిల్లలకు ప్రాధాన్య సేవలు.
సవాళ్లు, భద్రతా ఆందోళనలు
ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో, 112 వంటి వ్యవస్థలలో సమాచార గోప్యత భద్రత కీలకం. GPS ట్రాకింగ్, కాల్ డేటా రికార్డింగ్ వంటివి అధికార దుర్వినియోగానికి దారితీయవచ్చు, ముఖ్యంగా సరైన నిఘా, నియంత్రణ లేకపోతే. ఈ వ్యవస్థను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అదనంగా, ప్రజల్లో 112 నంబర్ గురించి అవగాహన కల్పించేందుకు స్కూళ్లు, కాలేజీలు, సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు అవసరం.