Nampally Court: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ 2012లో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిజామాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అక్బరుద్ధీన్ నెలన్నర పాటు జైలులో ఉండాల్సి వచ్చింది కూడా. దాదాపు 10ఏళ్లపాటు కొనసాగిన అక్బరుద్దీన్ కేసును నాంపల్లి కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది.

అక్బరుద్దీన్ కు శిక్ష ఖరారు అవుతుందని అంతా భావించిన సమయంలో ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే తీర్పు సమయంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను చేయద్దని అక్బరుద్దీన్ కు కోర్టు సూచించింది. దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలను ఇకపై చేయద్దంటూ మందలించింది.
ఎంఐఎంతో తొలి నుంచి కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీ కోర్టు తీర్పును తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో న్యాయస్థానికి పోలీసులు సరైన ఆధారాలు చూపించలేదని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎంఐఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని, వీరిద్దరు కమ్మక్కై కేసును గార్చే ప్రయత్నం చేశారని పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది.
కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలని, అలాంటి సాక్ష్యాలను సమర్పించడంలో పోలీసులు విఫలం అయ్యారనే ప్రచారాన్ని బీజేపీకి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. దీని వెనుక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ వాదిస్తోంది. టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఈ కేసు విషయంలో ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం నేతలు రెచ్చిపోయి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఎవరూ అధికారంలో ఉన్నా స్టీరింగ్ తమ చేతిలో ఉంటుందని గతంలో ఎంఐఎం నేతలు మాట్లాడిన మాటలను వారంతా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎంఐఎం లాంటి హిందు వ్యతిరేక శక్తులను ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.
[…] Also Read: Nampally Court: కోర్టు తీర్పు బీజేపీకి అస్త్రం… […]
[…] Nellore Politics: మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. కొత్త మంత్రులు కొలువుదీరారు. మంచి ముహూర్తాలు చూసి బాధ్యతలు సైతం స్వీకరించారు. కానీ మంత్రివర్గ విస్తరణ సెగ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే చాలా జిల్లాల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సెగ తాకుతోంది. వైసీపీలో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. గత కేబినెట్లో 25 మంది మంత్రులకుగాను.. కేవలం 11 మందికి మాత్రమే కొనసాగింపు లభించింది. మిగతా 14 మందికి ఉద్వాసన తప్పలేదు. అయితే తప్పించిన మంత్రులు కుతకుతలాడుతున్నారు. కొత్తగా మంత్రులైన వారిపై గుర్రుగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి కాకాని గోవర్థన్ రెడ్డికి కొత్తగా అవకాశమిచ్చి అగ్నికి ఆజ్యం పోశారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. కానీ జగన్ తన తొలి కేబినెట్ లో అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశమిచ్చారు. దీంతో జగన్ సొంత సామాజికవర్గ నేతలు కారాలు మిరియాలు నూరారు. జగన్ ఇవేవీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు. […]