MP Arvind Comments On Revanth Reddy And KTR: రాజకీయాలలో ఉన్న వారంతా మూస ధోరణిలో మాట్లాడితే చూసే వాళ్లకు.. వినే వాళ్లకు పెద్దగా ఎక్కదు. అలా కాకుండా జనాలకు అర్థమయ్యే భాషలో.. జనాలు అర్థం చేసుకునే భాషలో మాట్లాడితే ఇక తిరుగు ఉండదు. ఇదే విధానాన్ని ధర్మపురి అరవింద్ అమలు చేస్తుంటారు. అందువల్లే నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయన వరుసగా విజయం సాధించుకుంటూ వస్తున్నారు. కీలకమైన పసుపు బోర్డు కలను సాకారం చేసుకున్న ఆయన.. రాజకీయంగా తన పార్లమెంట్ స్థానంలో దూకుడుగా వెళ్తున్నారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని సత్తా చూపించారు.
తన పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు ధర్మపురి అరవింద్ సన్మానం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న తొండల వ్యవహారాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇటీవల కోస్గి ప్రాంతంలో జరిగిన ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే లాగులో తొండలు విడిచి కొడతా అంటూ హెచ్చరించారు. దీనిని ధర్మపురి అరవింద్ ప్రముఖంగా ప్రస్తావించారు.. లాగులో తొండలు విడుచుడు కాదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండ పరిమాణంలో ఉంటాడు కాబట్టి.. వాళ్ల లాగులలో జొర్రాలని సూచించారు. “నిన్ను ముఖ్యమంత్రి చేసింది వాళ్ల లాగుల్లో, వీళ్ళ లాగుల్లో తొండ లాగా జొర్రు తావని కాదు. వాళ్లందర్నీ బొక్కలో వేస్తామని.. ఇలాంటి మాటలు మాట్లాడితే జనం నవ్వుతారని” అరవింద్ పేర్కొన్నారు.
అరవింద్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను బిజెపి నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు అరవింద్ ఇచ్చిన కౌంటర్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఆ వీడియో కాస్త నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే అది సోషల్ మీడియాలో బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.
View this post on Instagram