Jalsa And Murari Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , మహేష్ బాబు(Superstar Mahesh Babu) సినిమాలతో, ఒక హీరో రికార్డ్స్ క్రియేట్ చేస్తే, మరో హీరో రికార్డ్స్ బద్దలు కొడుతాడు. గడిచిన మూడేళ్ళ నుండి ఇదే జరుగుతూ వస్తోంది. మధ్యలో బాహుబలి రీ రిలీజ్ వంటివి తళుక్కుమని అలా మెరిసాయి కానీ, ప్రధాన పోటీ మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల మధ్యనే ఉండేవి. అలాంటి ఈ ఇద్దరి హీరోల పాత క్లాసిక్ సినిమాలు ఒకేసారి విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నామా?. కానీ ఎల్లుండి వాస్తవ రూపం లో అది జరగనుంది. మహేష్ బాబు మురారి(#Murari4K) , పవన్ కళ్యాణ్ జల్సా(#Jalsa4K) చిత్రాలు డిసెంబర్ 31 న విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆ ఇద్దరి హీరోల కెరీర్ లో ఎలాంటి మైల్ స్టోన్స్ గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇది వరకే ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకే రోజున రెండవ సారి రీ రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కాసేపటి క్రితమే మొదలు పెట్టారు. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం తిరుగులేని ఆధిపత్యం తో ముందుకు దూసుకుపోతుంది. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. నిమిషాల వ్యవధి లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 15 షోస్ నుండి 10 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టారు. ఇక మురారి విషయానికి వస్తే నిన్న ఉదయం ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. జల్సా మూవీ టికెట్ రేట్ 150 రూపాయిలు అయితే, మురారి కి కేవలం 100 రూపాయిలు మాత్రమే పెట్టారు.
జల్సా సినిమాకు నూన్ షోస్, మ్యాట్నీ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే, మురారి చిత్రానికి అందరూ థియేటర్స్ కి కదిలే సమయమైనా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. అయినప్పటికీ కూడా జల్సా ముందు మురారి నిలబడలేకపోయింది. హైదరాబాద్ లో 21 షోస్ నుండి మురారి చిత్రానికి కేవలం 8 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంత మొత్తం ఈ చిత్రానికి 13 గంటల్లో వస్తే, జల్సా చిత్రానికి కేవలం ఒక్క గంటలో వచ్చాయి. నేడు ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు కాబోతున్నాయి. ఎవరిదీ పై చేయిగా నిలుస్తుందో చూడాలి.