MLC Voter Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు.. ఈ లింక్‌తో ఈజీగా దరఖాస్తు చేసుకోండి

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 2025, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికలకు చర్యలు చేపట్టింది. ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 9:43 pm

MLC Voter Registration

Follow us on

MLC Voter Registration : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 2025 మార్చిలో ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. నవంబర్‌ 6వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకోవచ్చు. అయితే ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించి 20 రోజులైనా నత్తనడకన సాగుతోంది. చాలామందికి ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం, ప్రాసెస్‌ సుదీర్ఘంగా ఉండడం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చాలా మందికి పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో ఓటరు నమోదు నత్తనడకన సాగుతోంది. అయితే ఈ వివరాలు తెలుసుకుంటే ఈజీగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు చేసుకోవచ్చు.

– కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటరు లిస్ట్‌ షెడ్యూల్‌ విడుదల చేసపింది. గతంలో ఓటరుగా నమోదు చేసుకున్నవారు కూడా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. 2023, నవంబర్‌ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై మూడేళ్లు దాటిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

– ఆఫ్‌లైన్‌లో అంటే తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయాల్లో పూర్తి వివరాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పూర్తి చేసినవారు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల మెమో లేదా డిగ్రీ పట్టా జిరాక్‌‍్స పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు చూపించి జిరాక్స్‌ పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి. ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలి.

– పామ్‌-18 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు ముదుగా https://ceotelangana.nic.in/home.html సైట్‌లోకి వెళ్లాలి. ఇందుకోసం ఈ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అ‍్కడ కనిపించే council constituency ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఫామ్‌ – 18 కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలు నింపాలి.

– ఓటరు నమోదుకు నవంబర్‌ 6వ తేదీ వరకు గడువు నిర్ణయించింది. ఆ తర్వాత డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేస్తారు. అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు పరిష్కరించి తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.