MLC Kavitha: ఆరోపణలు.. ఆగ్రహం.. నిర్వేదం.. అసంతృప్తి ఇవన్నీ పక్కన పెడితే సోమవారం జాగృతి అధినేత్రి మాట్లాడిన మాటల్లో ఒకటి మాత్రం నిజం. అలాగని మిగతావన్నీ అబద్ధాలు కాదు.. తనపై కొంతమంది కావాలని ఆరోపణలు చేస్తున్నారని.. అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని గులాబీ దళపతి కుమార్తె వాపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా పెయిడ్ సైన్యాన్ని పెట్టుకొని తనను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒకటి అంటే నేను పది అంట.. మీరు దేనిని చూసుకొని రెచ్చిపోతున్నారో.. అందులోనే సత్తా చూపిస్తా అని సవాల్ విసిరారు కెసిఆర్ కుమార్తె. అది నిజమని తేటతెల్లమవుతుంది.
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
నిన్నటిదాకా గులాబీ కారులో ఉన్నారు కాబట్టి కవిత ఎలా ఉన్నా సరిపోయింది. కానీ ఇప్పుడు ఆమె గులాబీ పార్టీలో కీలక నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమె విమర్శలు చేసిన వారు సొంత కుటుంబ సభ్యులు. కాబట్టి ఆమె చేసిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. సరే వీటి గురించి ఎలా ఉన్నప్పటికీ కవితకు ఇప్పటికిప్పుడు సోషల్ బలం చాలా అవసరం. ఆమె రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తదుపరి నిర్ణయం ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఆమె తన ప్రణాళికలను ఒకరకంగా చెప్పేసినట్టే. కారు పార్టీ నుంచి తెగ తెంపులకు దాదాపుగా సిద్ధమైనట్టే. అందువల్లే ఆమె ఈ రకంగా మాట్లాడుతున్నారు.. ఓపెన్ గానే చాలెంజ్ విసురుతున్నారు.
కవిత పోరాటంలో న్యాయం ఉన్నప్పటికీ.. ఇప్పటి రాజకీయాలు సోషల్ మీడియా వేదికగాన జరుగుతున్నాయి. ఇది గుర్తించే ఆమె సోదరుడు బలాన్ని పెంచుకున్నాడు. తెలంగాణ రాజకీయాలలో తనను తాను భావి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్నాడు. సహజంగానే గుర్తింపు ఎవరైనా కోరుకుంటారు. రాజకీయ నాయకులు ఈ విభాగంలో ముందు వరుసలో ఉంటారు. దానికి కవిత మినహాయింపు కాదు. అయితే సోమవారం ఆమె కీలక ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఊహించిన స్థాయిలో ఆ వీడియోకు రీచ్ లభించలేదు. కేవలం 17 కామెంట్లు మాత్రమే వచ్చాయి. వ్యూస్ కూడా 1000లోపే ఉన్నాయి.. కవిత లాంటి నాయకురాలికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. ఆమె మీడియాలో ఏం మాట్లాడినా సంచలనం కావాలి. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా ప్రకంపనలు సృష్టించాలి. ఇదంతా జరగాలంటే ఆమె కంటూ ఒక వ్యవస్థ ఉండాలి. ఆమె మీద ఎటువంటి విమర్శ వచ్చినా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టే ఆమె సోదరుడు సొంతంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికైనా కవిత దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటే మంచిది. లేకపోతే ఎదగడం కాదు కదా కౌంటర్ ఇవ్వడం కూడా సాధ్యం కాదు. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు.
మీ కక్కుర్తి వల్ల కేసీఆర్ గారి పేరు బద్నాం అయ్యే పరిస్థితి వచ్చింది – ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3EFDLdyLi7
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) September 1, 2025