HBD Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గొప్ప గుర్తింపు ఉందో, దానికి సమానమైన స్టార్ డమ్ ను సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… జనాల హృదయాల్లో చెరగని ముద్రని వేసుకొని అన్నకి తగ్గ తమ్ముడిగా మంచి పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం అటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సైతం ఆయన కోసం చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు…
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
పవన్ కళ్యాణ్ కెరియర్ మొదటి నుంచి కూడా చాలా వరకు తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. మొదట్లో ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలా చూసుకునేవాడు. అంత ఈజీగా దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే తన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అలాగే ఆ సినిమాలో తను ఎలా అయితే కనిపిస్తున్నాడో తన అభిమానులు కూడా అలాంటి వైఖరిని అనుసరించాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆయన జనాల్లో తన ఇంపాక్ట్ మంచిగా ఉండాలి తప్ప చెడు ను ప్రాజెక్ట్ చేసేలా ఉండకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని చేస్తూ వచ్చాడు. ఇక ఒకానొక సందర్భంలో ఆయన వల్ల చాలామంది అభిమానులు సిగరెట్లు తాగుతున్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో తను సిగరెట్లు తాగడం మానేసినట్టుగా, అసలు సిగరెట్ వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది అన్నట్టుగా డైలాగులు చెప్పడంతో తన అభిమానులు సైతం చాలా మంది సిగరెట్ తాగడం మానేసారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరిని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగిస్తున్నాడు. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యంత మైనస్ గా మారిన విషయాలు ఏంటి అంటే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అంటూ చాలా మంది చెబుతూ ఉంటారు. మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన మెంటాలిటీకి పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి సెట్ అవ్వకపోవడంతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక భరణంగా ఆమెకు కొన్ని కోట్ల రూపాయలను చెల్లించానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం విశేషం…
ఇక ఆ తర్వాత రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అఖీరానందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల అది నచ్చని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో వాదనకు దిగింది.
దానివల్ల పవన్ కళ్యాణ్ ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక అప్పుడు జర్మనీ అమ్మాయి తీన్మార్ సినిమాలో తనతో పాటు నటించిన అన్న లెజోన్నోవా ను పెళ్లి చేసుకున్నాడు. మరి మొత్తానికైతే ఈ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన అనేది ఇప్పుడు వస్తుంటుంది. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా అపోజిషన్ పార్టీ వాళ్లు ఎప్పుడూ ఈ మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతవరకు నిరాశ అయితే కలుగుతూ ఉంటుంది…
ఇక అందరం ఇష్టపడే చందమామలో సైతం మచ్చ ఉంది. పవన్ కళ్యాణ్ జీవితంలో మచ్చలు ఉండడంలో తప్పేముంది అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆయన జనానికి సేవ చేస్తున్నాడా? లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకోవాలని పర్సనల్ విషయాలు గురించి మనకు అవసరం లేదని చెప్పే వాళ్ళు సైతం ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆయన ఒక గొప్ప హీరో అంతకు మించిన గొప్ప నాయకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు…