War 2 Trailer Postponed: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి వస్తున్న చిత్రం ‘వార్ 2′(War2 Movie). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరో గా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్ తోనే ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడని స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. దీంతో అభిమానులు అసలు ఈ సినిమా చేయడం అవసరమా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్ క్యారెక్టర్స్ చేస్తున్న ట్రెండ్ ఎక్కువ అయిపోవడం తో, ఎన్టీఆర్ అభిమానులు కూడా అలవాటు చేసుకొని ఈ సినిమా కోసం రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమాలకు చేసే హంగామా చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించి ప్రొమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 23 న విడుదల చెయ్యాలని ముందుగా మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ ఆలోచనని ఇప్పుడు మార్చుకున్నారు. ఆగష్టు మొదటి వారం లో విడుదల చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు. కొంతమంది వాయిదా వెయ్యడానికి కారణం ఇంకా ఫైనల్ మిక్సింగ్ పూర్తి కాలేదని అంటుంటే, మరికొంతమంది మాత్రం ‘సైరా’ అనే హిందీ చిత్రం ప్రభంజనం నడుస్తుండడం వల్ల అని అంటున్నారు. కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ హిందీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందే అద్భుతమైన సాంగ్స్ తో మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రం, ఆ పాజిటివ్ బజ్ ప్రభావం తోనే బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా గురించి తప్ప, మరో చిత్రం గురించి మాట్లాడుకోవడం లేదు. ఇలాంటి సమయం లో ‘వార్ 2’ ట్రైలర్ ని విడుదల చేస్తే సరిగా రీచ్ అవ్వదు అనే ఉద్దేశ్యం తో ఆగష్టు మొదటి వారానికి వాయిదా పడిందని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమో తెలియదు కానీ, ట్రైలర్ మాత్రం వాయిదా పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఆమె ఉన్న షాట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి తర్వాత కియారా అద్వానీ ఇంకా హాట్ గా తయారైంది అని అందరు అంటున్నారు. ఈమె హృతిక్ రోషన్ కి జోడిగా నటించింది. ఎన్టీఆర్ కి ఈ చిత్రం లో హీరోయిన్ లేదని సమాచారం.
One attachment
• Scanned by Gmail