MLA Maganti Gopinath Health: కార్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆయన అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సైకిల్ పార్టీలో తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన.. జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గం లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం హస్తం ప్రభంజనం సాగినప్పటికీ.. జూబ్లీహిల్స్ లో ఆయన మాత్రం విజయం సాధించారు. మొత్తంగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు. గోపీనాథ్ కు బోరబండ ప్రాంతానికి చెందిన సర్దార్ ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు..
Also Read: రోజాపై మళ్లీ రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.. వైరల్ వీడియో
బోరబండ స్థానం నుంచి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన బాబా ఫసియుద్దీన్ గులాబీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉపమేయరుగా కొనసాగారు. ఎప్పుడైతే రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆయన పార్టీ మారిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే సర్దార్ ను బాబా ఫసియుద్దీన్ టార్గెట్ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో కూడా అదే తీరుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ప్రముఖ ఛానల్లో కూడా అదే తీరుగా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఫసియుద్దిన్ వేధింపుల వల్లే సర్దార్ చనిపోయాడని.. సర్దార్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి గోపీనాథ్ డీలా పడిపోయారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. తన కుడి భుజానికి కోల్పోయానని.. నిద్ర, తిండి మానేశారని.. అందువల్లే అనారోగ్యానికి గురయ్యారని కారు పార్టీ నాయకులు అంటున్నారు.
ఇటీవల సర్దార్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ శ్రవణ్ వెళ్ళినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు..” ఫసియుద్దిన్ వేధింపుల వల్ల సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితంగా గోపీనాథ్ డిఫెన్స్ లో పడిపోయారు.. అందువల్లే అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న పసియుద్దిన్ పై చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం అతడికి రక్షణ కల్పిస్తోంది.. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వమే కావాలని చేసినట్టు కనిపిస్తోంద” శ్రవణ్, కృష్ణారావు ఆరోపించారు. మొత్తంగా ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుండగా.. హైదరాబాద్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే ఇప్పటికే ఫసియుద్దిన్ పై కారు పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఇండియాకు వచ్చిన తర్వాత.. తదుపరి కార్యాచరణ నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. ఫసియుద్దిన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram