Dwaraka Women: ప్రభుత్వం మహిళల సాధికారత దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. దీనివలన చాలామంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మహిళలకు రూ.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చే సేవలను కూడా మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రవాణా సేవలలో కూడా మహిళలను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. డ్వాక్రా సంఘాలలోని మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాట్లతోపాటు నిర్వహణ పనులు కూడా చూసుకుంటున్నారు. వీటితోపాటు తాజాగా మహిళలకు ప్రభుత్వం మరొక మంచి శుభవార్త తీసుకొని వచ్చింది. త్వరలో మహిళా సంఘాలలోని వాళ్లు కేబుల్ ఆపరేటర్లుగా కూడా బాధ్యతలను నిర్వహించబోతున్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం టీ ఫైబర్ సేవలను తీసుకొని రాబోతుంది. మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు వీటిలో కేబుల్ ఆపరేటర్లుగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రతి జిల్లాకు 90 యూనిట్ల చొప్పున కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు కూడా యూనిట్లో రాబోతున్నాయి.
మహిళా సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3 యూనిట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఒక యూనిట్ ను ఒక గ్రామంగా పరిగణలోకి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విధంగా చూసుకుంటే మహిళా కేబుల్ ఆపరేటర్లు 90 గ్రామాలకు ఉండనున్నారు అని తెలుస్తుంది. పరిశ్రమ శాఖ అధికారులు టీ ఫైబర్ నెట్ లో కేబుల్ ఆపరేటర్లుగా ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంపికైన మహిళలు వీటికోసం కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. వీటికి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా కొనాల్సి ఉంటుంది. వీటికి కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవసరం ఉంటుంది.
దీనికోసం ప్రభుత్వం ఎంపికైన మహిళలకు స్త్రీ నిధి సమాఖ్య కింద ప్రతి యూనిట్కు రూ.4 లక్షలు రుణం అందిస్తుంది. రాష్ట్రంలో నారాయణపేటలో 8200కు పైగా అలాగే మహబూబ్నగర్లో 11,300, నాగర్ కర్నూల్ లో 13 వేలు, జోగులాంబ గద్వాలలో 6900, వనపర్తిలో 7500 మహిళా సంఘాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో ఉన్న మహిళా సంఘం సభ్యురాలు అపర్ణ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది మహిళలకు చాలా ప్రయోజనం కలగనుందని తెలిపారు.