Siva Karthikeyan In Hari Hara Veera Mallu: ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం గురించి ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత మన టాలీవుడ్ కి బిజినెస్ లేదు. మధ్యలో రెండు మూడు సినిమాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఆడాయి కానీ, అవి ఇండస్ట్రీ కి వేరే లెవెల్ ఆదాయాలను తెచ్చిపెట్టలేదు. సరిగా ఆ సమయంలో విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం పై ఇండస్ట్రీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. జూన్ 12 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై అతి త్వరలోనే క్లారిటీ ఇస్తామంటూ నేడు ఈ సినిమా మేకర్స్ మీడియా కి ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. త్వరలో విడుదల చేయబోయే థియేట్రికల్ ట్రైలర్ లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
Also Read: కన్నప్ప’ లో రజనీకాంత్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ చిత్రం ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కీలక పాత్ర పోషించాడట. అప్పట్లో ఈ వార్త ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళం లో భారీ రీచ్ రావడానికి శివ కార్తికేయన్ బాగా ఉపయోగపడుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ అది కేవలం రూమర్స్ అని అప్పట్లో కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మొదటి కాపీ రెడీ అవుతున్న సమయంలో మళ్ళీ శివ కార్తికేయన్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ చిత్రం లో నిజంగానే ఆయన ఒక కీలక పాత్ర పోషించాడా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. త్వరలో విడుదల చేయబోయే ట్రైలర్ లో ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మొదటి భాగం లో శివ కార్తికేయన్ లేకపోయినా రెండవ భాగం లో కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. శివ కార్తికేయన్ కి ప్రస్తుతం తమిళనాడు లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, ఆ తర్వాత కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి, ఆ తర్వాత హీరో గా మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం తమిళనాట తలపతి విజయ్ స్థానం ఖాళీ అయ్యింది. ఎందుకంటే రీసెంట్ అనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులు మొదటి నుండి శివ కార్తికేయన్ ని అభిమానిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం విజయ్ అభిమానులు ముక్తకంఠం తో శివ కార్తికేయన్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పీక్ సమయం లో ఆయన ‘హరి హర వీరమల్లు’ లో ఉంటే ఆ చిత్రానికి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.