Telangana Wine Shops Dasara: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. ప్రకృతిలో లభించే పువ్వులను పూజించే పండుగ ఇది. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండగ తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను కన్నుల పండువగా నిర్వహిస్తారు. దసరా పండుగను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరాకు పేరు ఉంది.
దసరా నాడు మద్యం, మాంసం విక్రయాలు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈసారి అక్టోబర్ 2న దసరా రావడంతో సందిగ్ధం ఏర్పడింది. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ మహాత్ముడి జయంతి. ఆరోజు అహింసా దినం కాబట్టి మాంసం విక్రయాలు జరగవని తెలుస్తోంది. దానికి తోడు మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వం బందు చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే వైన్ షాప్ నిర్వాహకులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2న మద్యం షాపులు బంద్ ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలని సూచిస్తున్నాయి. వాస్తవానికి పండుగల సందర్భంలో బంద్ కనుక ఉంటే ఒకటి లేదా రెండు రోజుల ముందు వైన్ షాప్ నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి ముందుగానే మందు స్టాక్ చేసుకోవాలని వైన్ షాప్ నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.
మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ముగియబోతోంది. త్వరలోనే నూతన మద్యం షాపులు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజును మూడు లక్షలు గా నిర్ణయించింది. ఇందులో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే మూడు లక్షల రూపాయలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో తిరిగి ఇవ్వదు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం వస్తుందని సమాచారం. గదానికంటే ఈసారి ఫీజును పెంచడం నేపథ్యంలో ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఆధారంగా 2000+ వైన్ షాపులు ఏర్పాటు కాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ దసరా అంటేనే చుక్క, ముక్క. అలాంటప్పుడు అది లేకుండా ప్రజలు ఉండలేరు. పైగా కొంతకాలంగా మద్యం తాగడం అనేది అలవాటుగా మారిపోయింది. అలాంటప్పుడు ముందుగానే ప్రజలు మద్యాన్ని స్టాక్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.