https://oktelugu.com/

Konda Surekha : మరో వివాదంలో తెలంగాణ మహిళా మంత్రి.. ఇంట్లోనే బీర్ల పార్టీ!

తెలంగాణలో ఓ మహిళా మంత్రి తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఓ ప్రముఖ సినీ హీరో ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసి పరువునష్టం కేసు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇంట్టోనే మందు పార్టీ పెట్టేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2024 / 12:20 PM IST

    Konda Sureka

    Follow us on

    Konda Surekha : తెలంగాణలో ఆమె మంత్రి. బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. కానీ, 11 మంది మంత్రుల్లో కొండా సురేఖ ఒక్కరే తరచూ వివాదాస్పదమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డికి లేని తలనొప్పులు, తలవంపులు తెస్తోంది. ఇటీవలే తనను సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ నాయకులు ట్రోల్‌ చేశారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి లేని వివాదం కొనితెచ్చుకున్నారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు బూమరాగ్‌ అయ్యాయి. దీంతో ఆ వ్యాఖ్యలు ప్రముఖ హీరో నాగార్జునకుటుంబంతోపాటు, హీరోయిన్‌ను తాకాయి. దీంతో ఇండిస్ట్రీ నుంచి మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రిగారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా బాధితులు పరువు నష్టం కేసు వేయడంతో ప్రస్తుతం ఆ కేసు కొనసాగుతోంది.

    తాజాగా మరో వివాదం..
    తెలంగాణ మహిళా మంత్రి అయిన కొండా సురేఖ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో బీరు పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. ఇటీవలే మంత్రి మనవరాలి బర్త్‌డే అయింది. ఈ సందర్భంగా మంత్రి తన ఇంట్లో బీరు, బిర్యానీ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొండా సురేఖకు ఆమె సన్నిహితురాలు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె వీడియోకాల్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    నెటిజన్ల ఆగ్రహం..
    ఈ వీడియోలో కొండా సురేఖ మాట్లాడుతూ ఇంట్లో పార్టీ జరగుతోందని, బిర్యానీ తెచ్చుకున్నామని తెలిపారు. బిర్యానీ మాత్రమేనా బీర్‌ లేదా అని ప్రశ్నించగా, బిర్యానీ ఉందంటే బీరు ఉన్నట్లే కదా అని సమాధానం ఇచ్చారు. అయితే ఈ వీడియోను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బీరు, బిర్యానీ పార్టీ చేసుకోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తాజాగా బీరు, బిర్యానీ పార్టీలు బుక్‌ అయింది అని కామెంట్లు పెడుతున్నారు.