https://oktelugu.com/

Kurnool : తన ఎడ్ల బాడుగ కోసం.. 80 పశువులను మట్టు పెట్టాడు.. రైతు ఘాతుకం!

తాను బాగుపడితే చాలు.. ఎదుటివారు ఏమైనా పరవాలేదు భావిస్తుంటారు కొందరు. దానికోసం ఎంత దాకైనా తెగిస్తారు. అటువంటి ఘటనే కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన స్వార్థం కోసం మూగజీవాలను విష ప్రయోగం చేసి చంపడం సంచలనం రేకెత్తించింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 22, 2024 / 12:14 PM IST

    Kurnool

    Follow us on

    Kurnool :  ఆ ఊర్లో వరుసగా పశువులు మృత్యువాత పడుతున్నాయి. గత నాలుగు ఏళ్లుగా 80 ఎడ్లు, బర్రెలు చనిపోయాయి. అయితే ఇదో మిస్టరీగా మారిపోయింది. చేతబడి అని ఒకరు.. ముందు పెట్టి చంపేశారని మరికొందరు అనుమానంతో ఉండేవారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.ఆయన చర్యలు అనుమానం కలిగేలా కనిపించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీసీ కెమెరాలు మిస్టరీని ఛేదించాయి. ఒక వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని బయటపెట్టాయి. కర్నూలు జిల్లా కమలాపురంలో గత నాలుగేళ్లలో 80 ఎడ్లు, బర్రెలు చనిపోయాయి. ఇటీవల ఓ ఇంట్లో దూడ చనిపోయింది. అయితే ఇంటి పరిసరాల్లో అమర్చిన సిసి కెమెరాలు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో గ్రామస్తులు పరిశీలించగా ఆ దూడకు అదే వ్యక్తి మందు పెట్టి చంపేసినట్లు బయటపడింది. దీంతో గ్రామస్తులంతా పశువులు చనిపోవడానికి ఆ వ్యక్తి కారణమని నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    * ఎడ్ల బాడుగ కోసం
    గ్రామంలో శంకరాచారి అనే వ్యక్తికి ఎడ్లు ఉన్నాయి. వాటిని బాడుగకు ఇస్తుంటాడు. అయితే గ్రామంలో ఇతరుల వద్ద పశువులు ఉంటే తన బాడుగ తగ్గిపోతుందని భావించాడు. అందుకే గ్రామంలో పశువులకు విషప్రయోగం చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న బుగ్గన శివరామిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లాడు శంకరాచారి. గోడ దూకి పశువుల దగ్గరకు వెళ్లాడు. కూడే దూడకు మందు పెట్టి అక్కడినుంచి పారిపోయాడు. ఉదయానికి ఆ దూడ చనిపోయింది. ఇవన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. దీంతో వెంటనే గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.

    * పోలీసులకు ఫిర్యాదు
    గ్రామంలో 80 పశువుల మరణానికి శంకరాచారి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు శంకరాచారిని అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకు చేపట్టారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేవలం బాడుగ కోసమే ఈ కిరాతకానికి దిగినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఒక్క ఊరిలోనే పశువులను చంపాడా? లేకుంటే పక్క గ్రామంలో ఏమైనా అటువంటి ఘటనలు జరిగాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.