HomeతెలంగాణJoginapally Santosh: సంతోష్‌ మాఫియా.. వెలుగులోకి సంచలన నిజాలు

Joginapally Santosh: సంతోష్‌ మాఫియా.. వెలుగులోకి సంచలన నిజాలు

Joginapally Santosh: జోగినపల్లి సంతోష్‌రావు.. ఇలా అంటే చాలా మందికి తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సడ్డకుని కొడుకు… కేసీఆర్‌కు మందులు ఇచ్చే వ్యక్తి అంటే చాలా మందికి తెలుసు. ఇక హ్యాపీరావు అనే పేరుతో కూడా ఫేమస్‌ అయ్యాడు. మందులు ఇస్తున్నాడన్న బావనతో కేసీఆర్‌ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చాడన్న విమర్శలూ ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు అయినా.. ఆయన కేసీఆర్‌ పక్కన తప్ప ఎక్కడా కనిపించరు. రాజ్యసభలో కనిపించిన సందర్భాలు తక్కవ. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ వెంట ఉండి ఆయన వ్యవహారాలు చక్కబెట్టిడంతోపాటు బీఆర్‌ఎస్‌ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారని ప్రచారంలో ఉంది. ఇక గ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో మీడియాలో ప్రచారం చేయించుకునే సంతోష్‌రావు.. ఆ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ రాజ్యసభ ఎంపీ పై తాజాగా కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

భూకబ్జా కేసు..
బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని ఎన్‌ఈసీఎల్‌ కంపెనీకి చెందిన భూమిని సంతోష్‌రావు ఆక్రమించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు ప్రాబ్రికేటెడ్‌ డోర్‌ నంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. ఈ భూమిలో అక్రమంగా చొరబడి గదులు నిర్మిచుకున్నారని, ఈ వ్యవహారంలో సంతోష్‌కుమార్, లింగారెడ్డి, శ్రీధర్‌పై చింత మాధవ్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ముగ్గురిపై ఐపీసీ 420, 468, 471, 447, 120ట/ఠీ 34 సెక్షన్లలో కేసు నమోదు చేశామని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

వెంలుగులోకి అక్రమాలు..
ఇక సంతోష్‌రావు చేసిన అనేక అక్రమాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ‘టానిక్‌’ పేరుతో లిక్కర్‌ షాపు పెట్టి ఏజెన్సీలు నడిపించాడు. టాలనిక్‌ లిక్కర్‌ దందా వెనుక సంతోష్‌రావు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొన్ననే టానిక్‌ సంస్థపై దాడులు జరిగాయి. విచారణ జరుగుతోంది.

కవిత లిక్కర్‌ దందా వెనుక..
ఇక కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కవిత లిక్కర్‌ దందా వెనుక కూడా సంతోష్‌రావు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మార్పిడి వ్యవహారంలో కవితను ముందు ఉంచి సంతోష్‌రావు వెనుక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ్రీన్‌ ఛాలెంజ్‌ పేరుతో భూదందా..
ఇక సంతోష్‌రావు అడవుల సంరక్షకుడిగా తనను తానగు ప్రమోట్‌ చేసుకునేందుకు గ్రీన్‌ ఛాలెంజ్‌ పేరుతో ఓ కర్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్క నాటడంతోపాటు పెద్దపెద్ద నాయకులు, సినీ నటులు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఛాలెంజ్‌ విసిని వారితో మొక్కలు చాటించారు. అయితే దాని వెనుక అతిపెద్ద భూదందా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయన కన్ను పడిన భూముల వద్దనే ఆయన మొక్కలు నాటించారని తెలుస్తోంది. గతేడాది కొండగట్టు అడవి మొత్తాన్ని లీజ్‌కు తీసుకున్నారు. దీంతో ఇక్కడి గుట్టపై ఆయన కన్ను పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్‌ మాఫియా, కబ్జాలు, సెలిట్‌మెంట్ల, మీడియా ముసుగు(టీ న్యూస్‌ ఎండీ) పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్‌ టాపింగ్‌ వ్యవహారంలో కూడా సంతోష్‌ హస్తం ఉందని సమాచారం.

అనామకుడిగా వచ్చి..
సంతోష్‌రావు రాజకీయాలకు దూరంగా ఉంటారు. మీడియాకు కూడా ఎక్కడా కనిపించరు. ప్రెస్‌మీట్లు పెట్టరు. కానీ అన్నీ వెనక ఉండి నడపిస్తారు. కేవలం కేసీఆర్‌ సేవకుడిగా కనిపిస్తారు. కేసీఆర్‌ ఎదుట చేతులు కట్టుకుని పనివాడిలా నిలబడతారు. కానీ, ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయని అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు. కేసీఆర్‌ దగ్గర ఉంటూనే వందల కోట్లు సంపాదించడాని పేర్కొంటున్నారు. మొదట్లో కేసీఆర్‌కే పెగ్గు కలిపి ఇవ్వడంతో అనారోగ్య సమయంలో మందులు ఇచ్చేవడాని ప్రచారం జరిగింది. కానీ సంతోష్‌రావును కేసీఆర్‌ ఏకంగా రాజ్యసభకు పంపించారు. ఇక కేసీఆర్‌ కుటుంబానికి ఆయన బంధువు, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్యారావు దూరం కావడానికి కూడా సంతోష్‌రావే కారణమన్న ఆరోపణలుఉన్నాయి.

ప్రతీ వ్యవహారంలో తలదూర్చడం..
ఇక సంతోష్‌రావు ఎంపీ అయ్యాక ఆయన ఆగడాలు ఎక్కువయ్యాయని సమాచారం. కేటీఆర్‌ సీఎం కాకుండా అడ్డుకున్నది సంతోష్‌రావే అని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సంతోష్‌రావు వ్యవహారాలు నడిపిస్తుంటే.. కరీంనగర్‌ జిల్లాలో ఆయన తండ్రి రవీందర్‌రావు హవా నడిపించేవాడు. షాడో సీఎంంగా రవీందర్‌రావు చెలామని అయ్యాడు. ఉమ్మడి కరీంనగర్‌లో సెటిల్‌ మెంట్లు, భూదందాల్లో రవీందర్‌ రావు పాత్ర ఉంది.

రవీందర్‌రావుపై కేసు..
సంతోష్‌రావు తండ్రి రవీందర్‌రావుపైకూడా గత నెలలో కేసు నమోదైంది. ఓ యూట్యూబ్‌ చానెల్‌లో తనకు, మంత్రి పొన్న ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారని కూస రవీందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీందర్‌రావుతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తాజాగా బంజారాహిల్స్‌ పోలీసులు సంతోష్‌రావుపై కేసు నమోదు చేయడం గమనార్హం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular