Dangerous stunt with a Tractor: అది 44వ జాతీయ రహదారి. తెలంగాణలోని గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో నుంచి వెళ్తుంది. ఈ రోడ్డు జాతీయ రహదారి కావడంతో నిత్యం రాకపోకలు విపరీతంగా ఉంటాయి. పైగా ఈ రహదారి మీదుగా పెద్ద పెద్ద వాహనాలు వెళుతూ ఉంటాయి. జాతీయ రహదారి కావడంతో రాత్రి పగలు పెద్దగా తేడా ఉండదు. సాధారణంగా ఇలాంటి రహదారి మీద వెళ్లాలంటే కాస్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించాలి. కానీ ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఈ జాతీయ రహదారి మీద సర్కస్ స్కిట్లు చేశాడు. తను ప్రయాణిస్తోంది జాతీయ రహదారి మీద అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అంతేకాదు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడమే కాకుండా.. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
మానవపాడు నుంచి ఉండవల్లి ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నేషనల్ హైవేపై ఓ యువకుడు ట్రాక్టర్ వేగంగా నడిపాడు. అంతేకాదు ఆ ట్రాక్టర్ పై పడుకొని డ్రైవింగ్ చేశాడు.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి అతడు ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలు విపరీతంగా సాగుతూ ఉంటాయి. రాత్రి పగలు అని తేడా ఉండకుండా రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి ఈ రహదారి మీద ట్రాక్టర్ నడపడమే పెద్ద విషయం. పైగా ఆ ట్రాక్టర్ మీద పడుకొని.. విపరీతమైన వేగంతో నడపడం ఆ యువకుడి నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది.. అయితే ఈ వీడియో పోలీసుల కంటపడితే అతడికి చుక్కలేనని నెటిజన్లు అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. తోటి వారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా డ్రైవింగ్లో రకరకాల ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా పడుకున్నాడు. ఆ తర్వాత రైలు వెళ్లిపోయిన అనంతరం తాపీగా లేచి.. ఏదో విజయం సాధించినట్లు బిల్డప్ ఇచ్చాడు.. అంతకు ముందు ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వారికి మాత్రమే కాకుండా, ఇతరులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి..
అయితే ఇలాంటి వీడియోల పట్ల.. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వ్యక్తుల పట్ల ఇటీవల కాలంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సైబర్ విభాగం పోలీసులు ఇటువంటి వ్యక్తుల చేష్టలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ తరహా పరిణామాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి పనులు చేస్తున్న వారంతా.. తమ ప్రాణాలను రిస్కులో పెడుతున్నారు. అంతేకాదు ఎదుటి వాళ్ళ ప్రాణాలతో కూడా ఆటలాడుకుంటున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో భిన్నమైన పనులు చేసి ఫేమస్ అవ్వచ్చు. సమాజానికి హితం కలిగించే పనులు చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఫేమస్ అవడం ఏంటో వారికే తెలియాలని నెటిజన్లు అంటున్నారు.
నడిరోడ్డుపై యువకుడి ప్రమాదకర స్టంట్లు.. ఏకంగా ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్..!
జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల పరిధి 44వ జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యం
మానవపాడు నుంచి ఉండవల్లి వరకు నేషనల్ హైవేపై ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ తాపీగా పడుకుని డ్రైవింగ్
సోషల్ మీడియాలో వైరల్… pic.twitter.com/bHkfEEz2Da
— BIG TV Breaking News (@bigtvtelugu) June 16, 2025