Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan's invitation to the United Nations: ఐక్యరాజ్యసమితికి పవన్.. నిజం ఎంత?

Pawan Kalyan’s invitation to the United Nations: ఐక్యరాజ్యసమితికి పవన్.. నిజం ఎంత?

Pawan Kalyan’s invitation to the United Nations: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఊహించని ఆహ్వానం వచ్చింది. ఐక్యరాజ్యసమితి నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఈనెల 22న అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఓ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గౌరవం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. జనసైనికుల పేరిట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. విపరీతంగా దీనిని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన అంటూ జనసేన నుంచి కానీ.. ఏపీ ప్రభుత్వం నుంచి కానీ రాలేదు. అయితే ఇది గత ఏడాది వార్తగా తెలుస్తోంది.

అరుదైన ఛాన్స్..
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో పొలిటికల్ వింగ్( political wing ) ప్రత్యేక సభ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి రాజకీయ నేతలను ఆహ్వానిస్తుంది. అందులో భాగంగానే భారతదేశం నుంచి ఐదుగురు నేతలకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు కావడం. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ ఆహ్వాన జాబితాలో ఉన్నారు. అయితే గత ఏడాది పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం వచ్చింది. కానీ ఆ సమయంలో ఎన్నికల బిజీలో ఉండిపోయారు పవన్ కళ్యాణ్. అందుకే ఆ సమావేశానికి రాలేనంటూ వర్తమానం ఇచ్చారు. తనను పిలిచినందుకు ఐక్యరాజ్యసమితి పొలిటికల్ వింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు దానిని జనసేన అభిమానులు తరపున ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read: Shock to Thalliki Vandanam Scheme: తల్లికి వందనంకు ‘కరెంట్’ షాక్.. ఇలాగైతే కష్టమే.. కౌంటర్లు షురూ

ఏటా 120 మందికి ఆహ్వానం..
ఏటా ఐక్యరాజ్యసమితి నిర్వహించే పొలిటికల్ వింగ్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపిస్తుంటారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రశ్నించే తత్వం, ప్రజలకు చేరువు గా ఉండడం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నేతలను ఆహ్వానిస్తారు. గత ఏడాది ఈ జాబితాలో పవన్( Pawan Kalyan) ఉండేవారు. అయితే ఇదే విషయంపై ఆహ్వానం పంపగా పవన్ తన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మూలంగా ఆయన హాజరు కాలేకపోయారు. అయితే ఈ ఏడాది కూడా ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది అంటూ జనసేన తరుపున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular