Malla Reddy (1)
Malla Reddy: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీ చామకూర మల్లారెడ్డి. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మల్లారెడ్డి బీఆర్‌ఎస్(BRS)లో చేరారు. రేవంత్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగారారు. కానీ, టీడీపీ బలహీనపడడంతో కాంగ్రెస్‌లో చేరి.. పీసీసీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. అయితే మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య రాజకీయ వైరంతోపాటు వ్యక్తిగత వైరం కూడా ఉందంటారు విశ్లేషకులు. మల్లారెడ్డి వీటిని పక్కన పెట్టి మార్చి 21(శుక్రవారం)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిíశారు. తన విద్యా సంస్థల(Collages)కు సంబంధించిన మెడికల్ కాలేజీ(Medical Collage) సీట్ల పెంపు కోసం వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి, ‘రేవంత్‌ను కలిశాను, మంచి మాటలు చెప్పాడు. నా కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సీట్లు కావాలి. నేను ఎవరికీ తలవంచను, కానీ పిల్లల కోసం ఏం చేయలేను?‘ అని వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో ఆయన తన విద్యా సంస్థల పట్ల బాధ్యతను హైలైట్ చేస్తూనే, రాజకీయంగా ఎవరి ఒత్తడికీ లొంగననే సంకేతాన్ని ఇచ్చారు.
Also Read: ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు
తనదైన స్టైల్‌లో..
మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు సాధారణంగా లేకుండా, హాస్యం, ధైర్యం కలగలిపిన తన సహజ శైలిలో ఉన్నాయి. ఈ భేటీపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘మల్లారెడ్డి కాంగ్రెస్(Congress)తో రాజకీయంగా సన్నిహితంగా మారుతున్నారా?‘ అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు ‘ఇది కేవలం విద్యా సంస్థల సమస్యల కోసమే‘ అని సమర్థిస్తున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా మల్లారెడ్డి గతంలో భారాస (ఆఖ) నాయకుడిగా ఉంటూ ఇప్పుడు కాంగ్రెస్ సీఎంతో సమావేశమవడం ఊహాగానాలకు దారితీసింది. మల్లారెడ్డి ఎప్పుడూ తన విద్యా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడంలో ఆసక్తి చూపిస్తారు. ఈ భేటీ ద్వారా ఆయన తన మెడికల్ కాలేజీల సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఇది విద్యార్థులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఆయన వాదన. అయితే, ఈ సంఘటన రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది.
గతంలో దాడులు..
గతంలో ఐటీ రైడ్స్, భూ వివాదాల సమయంలోనూ తన ధైర్యస్వరూపాన్ని చాటిన మల్లారెడ్డి, ఈసారి కూడా తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి ఒక విశిష్ట వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఈ భేటీ రాజకీయ సమీకరణలను మార్చే అవకాశం ఉందా లేక విద్యా సంస్థల అభివద్ధికి మాత్రమే పరిమితమవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా, మల్లారెడ్డి స్టైల్ మరోసారి సంచలనం సృష్టించింది.