Anushka Poster Controversy : క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలు పోషించిన ‘వేదం’ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్ లో ‘వేదం’ సినిమాలోని అనుష్క హాట్ ఫోటో ని ఒక పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. ఈ హోర్డింగ్ ఇప్పుడు కొంప ముంచేసింది. అటు వెళ్తున్న వాహనదారులు అనుష్క వైపు చూస్తూ డ్రైవ్ చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయట. అలా ఈ హోర్డింగ్ ని చూసి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 యాక్సిడెంట్స్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది విన్న నెటిజెన్స్ జనాలు ఇంత కక్కుర్తితో ఉన్నారా?, ఇంటర్నెట్ ఉంది,సోషల్ మీడియా ఈ రేంజ్ లో వ్యాప్తి చెందింది. అనుష్క ని చూసుకోవాలంటే ఇంటికి వెళ్లి ప్రశాంతంగా మొబైల్ ని చూసుకోవచ్చు కదా?, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.
Also Read : హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు…ఇలా అయితే కష్టమేనా..?
ఇక వేదం సినిమా విషయానికి వస్తే ‘గమ్యం’ వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) తెరకెక్కించిన చిత్రమిది. ఆరోజుల్లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటిస్తుండడంతో మల్టీ స్టార్రర్ గా ఈ చిత్రం ప్రచారం పొందింది. పైగా అనుష్క లాంటి సూపర్ స్టార్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం తో అంచనాలు భారీగా ఉండేవి. ఇలా కమర్షియల్ స్టార్స్ అందరూ కలిసి ఒక అర్థవంతమైన సినిమా చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది కానీ, అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ లకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. చూసే ఆడియన్స్ కి కూడా ఒక మంచి సినిమాని చూసాము అనే అనుభూతిని ఇచ్చింది ఈ చిత్రం.
ఈ చిత్రం తర్వాత ఇప్పుడు అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ‘ఘాటీ’ అనే చిత్రం తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని గత ఏడాదే విడుదల చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. అనుష్క ని ఇప్పటి వరకు క్యూట్ హీరోయిన్ గా అందరూ చూసారు, అదే విధంగా ఆమెలోని హీరోయిజం ని కూడా చూసారు. మొట్టమొదటి సారి ఆమెలోని క్రూరత్వాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ క్రిష్. టీజర్ తోనే ఈ చిత్రం పై విపరీతమైన క్రేజ్ పెరిగింది. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఇక ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.