https://oktelugu.com/

అందుకే అభిజీత్ విన్నర్ అయ్యాడు… అసలు విషయం బయటపెట్టిన నాగ్

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ని హీరో అభిజీత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ కి చేరిన అఖిల్, అరియనా, హారిక, సోహెల్ లతో పోటీపడిన అభిజీత్ అత్యధిక ఓట్లు సంపాదించి విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక ఓట్లు అభిజీత్ కి పోలైనట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులు అభిజీత్ తీరుకు పడిపోయారని అతని గెలుపే తెలియజేసింది. అభిజీత్ అంతటి స్థాయిలో బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడానికి, అతను […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 03:47 PM IST
    Follow us on


    బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ని హీరో అభిజీత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ కి చేరిన అఖిల్, అరియనా, హారిక, సోహెల్ లతో పోటీపడిన అభిజీత్ అత్యధిక ఓట్లు సంపాదించి విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక ఓట్లు అభిజీత్ కి పోలైనట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులు అభిజీత్ తీరుకు పడిపోయారని అతని గెలుపే తెలియజేసింది. అభిజీత్ అంతటి స్థాయిలో బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడానికి, అతను గెలవడానికి కారణం ఏమిటో తెలియజేశారు. అభిజీత్ వ్యక్తిత్వమే అతని విజయానికి దోహదం చేసినట్లు నాగార్జున తెలియజేశారు.

    Also Read: స్టార్ హోటల్లో దాక్కున్న KGF రాకీ భాయ్ .. కారణం తెలిస్తే షాకింగే!

    టైటిల్ గెలిచినందుకు అభిజీత్ ని అభినందించిన నాగార్జున మాట్లాడుతూ… ‘నీ కూల్ నెస్, యాటిట్యూడ్ ప్రజలకు దగ్గర చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నీ రోల్ ఎలా ఉందో… బిగ్ బాస్ హౌస్ లో నీ ప్రవర్తన అలానే ఉంది . నువ్వు నీలాగా ఆడావు, ప్రశాంతంగా ఉంటూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే విజయం అదే వరిస్తుందని నువ్వు నిరూపించావు. నువ్వు గెలుచుకుంది ప్రైజ్ మనీ మాత్రమే కాదు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు కూడా. కెరీర్ లో పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అని నాగార్జున అభిజీత్ ని ప్రశంసించారు.

    Also Read: 2020లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీరే !

    అభిజీత్ బయట ఎలా ఉంటాడో… అలానే హౌస్ లో కూడా ప్రవర్తించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, ప్రశాంతమైన మనసుతో తెలివిగా ఆలోచించి విజయాన్ని అందుకున్నాడని నాగార్జున అభిజీత్ విజయ రహస్యం బయటపెట్టాడు. ఇక అభిజీత్ పాపులారిటి అమాంతం పెరిగిపోగా, వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. అలాగే ఆయనకు దర్శక నిర్మాతల నుండి కుప్పతెప్పలుగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. తెలివిగా సినిమాలు ఎంచుకొని కెరీర్ ప్లాన్ చేస్తే అభిజీత్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సక్సెస్ అయ్యే అవకాశం కలదు. గత మూడు సీజన్స్ వినర్స్ కెరీర్ కి బిగ్ బాస్ విజయం ఏమంత ఆధారం కాలేదు. మరి అభిజీత్ కెరీర్ ఏస్థాయికి వెళుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్