Loksabha Election Result 2024: ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ లీడ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత కీలక ప్రకటన చేశారు. ఎంఐఎం అధినేత అధినేత ఓవైసీ అసదుద్దీన్ పై బీజేపీ అభ్యర్థి తరుపున మాధవీ లత పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె పాపులర్ అయ్యారు. తనదైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకున్నారు. హిందుత్వ వాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆమె ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్యూతో దేశ వ్యాప్తంగా పరిచయం అయ్యారు. ఈ సందర్భంగా మాధవీ లత గెలుపు పై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాల సందర్భంగా మాధవీలత ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. కేంద్రంలో 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. 10 సంవత్సరాల్లో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలు ఆదరించారని చెప్పారు. దీంతో ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతారని అన్నారు.తెలంగాణలోనూ మెజారిటీ లోక్ సభ స్థానాలు గెలుచుకుంటారని అన్నారు.
మరోవైపె ఎన్డీఏ ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటేసీ లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం కు పట్టు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేసిన మాధవీ లత గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఎగ్జిట్ ఫోల్స్ లో మాత్రం ఎంఐఎం కే అవకాశం ఉందని తెలిసింది. అయితే పూర్తి ఫలితాలు వస్తే గానీ చెప్పలేం.