Satish Chander’s Love at Dust Sight : సతీష్ చందర్.. ఓ సీనియర్ జర్నలిస్ట్, కవి, వ్యంగ్యకారుడు, ఎడిటర్.. ఓ మల్టీ టాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఈయనలో తరగని కళలున్నాయి.. తరిగిపోని మేధస్సు ఉంది. ఆయన కలం నుంచి జాలువారుతున్న కావ్యాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అలరిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో ఆయన రచనలు అందరినీ ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయన వ్యాక్యం ఓ రసాత్మక కావ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సతీష్ చందర్ తాజాగా మరో పుస్తకంతో మన ముందుకు వచ్చారు. అదే ‘లవ్ ఎట్ డస్ట్ సైట్’.. ఈ 101 ప్రేమ కథల పుస్తకావిష్కరణ తాజాగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

సతీష్ చందర్ రాసిన ‘లవ్ ఎట్ డస్ట్ సైట్’పుస్తకాన్ని మహిళోద్యమ నేత వి.సంధ్య ఆవిష్కరించారు. ఈ సభకు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. స్త్రీవాద పరిశోధకులు అరుణ గోగులమండ, కుప్పిలి పద్మ వక్తలుగా పాల్గొన్నారు.

సతీష్ చందర్ రాసిన తొలి పుస్తకం పంచమవేదం ఎంతో పాపులర్ అయ్యింది. అదో గొప్ప కావ్యంగా నిలిచింది. సతీష్ చందర్ నేటికీ కలాన్ని దించకుండా వ్యాక్యాన్ని నిరంతరం రాస్తూ ముందుకు సాగుతుండడం అందరినీ స్ఫూర్తినిస్తోంది. ఆయన రాసిన ‘లవ్ ఎట్ డస్ట్ సైట్’ పుస్తకంలోని 101 ప్రేమ కథలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే విధంగా ఉన్నాయి.
సతీష్ చందర్ రాసిన ఈ పుస్తకంలో ప్రేమను 9 విభాగాలుగా వివరిస్తూ ఒక్కొక్క దాని గురించి చిన్న చిన్న కథల ద్వారా అందరికీ అర్థమయ్యేలా హృదయాలను తాకేలా రాశారు. అదే అందరికీ చేరువవుతోంది. అలరిస్తోంది.
ఈ పుస్తకావిష్కరణ చేసిన ఉద్యమనేత వి.సంఖ్య మాట్లాడుతూ.. స్త్రీవాది సతీష్ చందర్ చేసిన రచనలు ఎంతో గొప్పవని.. అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. ఇక కుప్పిలి పద్మ మాట్లాడుతూ సమాజాన్ని మేల్కోలిపే వ్యక్తులలో సతీష్ చందర్ ఒకరిని కొనియాడారు. ఈ కార్యక్రమ సమన్వయ కర్తగా ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కరస్పాండెంట్ గౌరీ చందర్ వ్యవహరించారు.