Venu Swamy
Venu Swamy: తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన జ్యోతిష్యుడు వేణుస్వామి. సెలబ్రిటీలు, సినిమా, రాజకీయరంగాల్లో ఉన్నవారి జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ఈ వేణుస్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన జ్యోతిష్యాల్లో 80 శాతం నిజమయ్యాయని ఆయన అభిమానులు చెబుతుంటారు. అక్కినేని నాగచైతన్య–సమంత, మెగా డాటర్ నిహారిక–చైతన్య జొన్నలగడ్డ విడాకుల విషయం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయం ముందే చెప్పి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన చెప్పిన మరో ప్రిడిక్షన్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది. అదే ఈ ఏడాది కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఆయన గతంలోనే చెప్పారు.
మరోమారు నొక్కి చెప్పిన వేణుస్వామి..
గతంలో చెప్పినట్లుగానే కేటీఆర్ అరెస్ట్ అవుతారని వేణుస్వామి తాజాగా మరోమారు అదేమాట నొక్కి చెప్పారు. అయితే ఏ కేసులో అరెస్టు అవుతారు అనే విషయం చెప్పలేదు. ఈ వార్త విన్న బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఆయన చెప్పినట్లుగా కవిత అరెస్ట్ అయ్యారు. తిహార్ జైల్లో ఉన్నారు. కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నామని నేతలు అంటున్నారు.
ఇప్పటికే పార్టీని వీడుతున్న నేతలు..
బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. కీలక నేతలు కూడా జంప్ అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్టు అవుతారన్న వార్త పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే కొంత మంది కాంగ్రెస్ నేతలు వేణుస్వామి ప్రిడిక్షన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతున్నారు. మరి వేణుస్వామి జ్యోతిష్యం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Ktr will be arrested soon venu swamy shocking comments