KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందు నుంచే గులాబీ పార్టీ విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. ఓటర్ల జాబితా నుంచి మొదలు పెడితే ప్రజల సమస్యల వరకు అన్నింటినీ వ్యూహంతో వెలుగులోకి తెచ్చింది. ఆటో కార్మికుల సమస్యల నుంచి మొదలు పెడితే ఆరు గ్యారెంటీ ల వరకు ప్రతి సమస్యను గులాబీ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. వాస్తవానికి గులాబీ పార్టీ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. పైగా కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిచారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వాస్తవానికి గులాబీ పార్టీ దూకుడు చూస్తే చాలామంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగే పోయింది ఉప ఎన్నికల్లో గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రారంభంలో ఇదే విషయాన్ని ప్రకటించాయి.. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తీన్ మారిపోయింది.. మొదటినుంచి కూడా ముందు వరుసలో ఉన్న గులాబీ పార్టీ అనూహ్యంగా వెనక్కి వెళ్ళిపోయింది.. దీంతో ఊహించని విధంగా అధికార పార్టీ రేసులోకి వచ్చింది. ప్రతిపక్ష గులాబీ పార్టీని డిఫెన్స్ లో పడేసి .. తిరుగులేని స్థాయిలో విజయాన్ని అందుకుంది. వాస్తవానికి గులాబీ పార్టీ ఇలా కావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గులాబీ పార్టీ కొన్ని పెయిడ్ సోషల్ మీడియా గ్రూపులను హైర్ చేసుకుంది. అందులో పని చేసేవారు పక్కా గులాబీ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం మొదలుపెట్టారు.. కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇవి కాస్త వ్యక్తిగతంగా ఉండడంతో జనాల్లో ఆలోచన మొదలైంది. ఇదే సమయంలో గులాబీ పార్టీ ప్రధాన మీడియాను దూరం పెట్టింది. వెబ్ సైట్ లను పట్టించుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ ను నమ్ముకుంది. పోనీ అందులోనైనా వాస్తవాలు ప్రజలకు తెలిశాయా అంటే లేదు అని చెప్పాలి.. వాస్తవానికి ఈ సోషల్ మీడియాలో జరిగిన విష ప్రచారం వల్లే ప్రజలు ఆలోచించారు.. పైగా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జూబ్లీహిల్స్ మొత్తం నాశనమైనట్టు.. గులాబీ పార్టీ ప్రచారం చేసుకుంది. హైడ్రా మీద.. ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ మీద అడ్డగోలుగా నెగిటివ్ ప్రచారం చేసింది. ఇవన్నీ కూడా జనాలను ఆలోచింపజేశాయి.
గులాబీ పార్టీ సోషల్ మీడియా గ్రూపులు పిచ్చిపిచ్చిగా కథనాలను.. ఇతర వ్యవహారాలను ప్రసారం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకోవడం వల్ల జూబ్లీహిల్స్ లో గెలవాల్సిన చోట.. గులాబీ పార్టీ పుట్టి మునిగింది.. వాస్తవానికి ప్రధాన మీడియాను ప్రజలు నమ్ముతుంటారు.. సోషల్ మీడియా ద్వారా కృత్రిమమైన హైప్ వస్తుంది. అది ప్రజలను ఓటు వేసేలా చేయదు. కానీ ఈ విషయం గులాబీ పార్టీకి ముఖ్యంగా కేటీఆర్ కు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మీడియాను నమ్ముకుంది. వివిధ వెబ్సైట్ ల ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో తమ గెలిస్తే ఏం చేస్తామో చెప్పగలిగింది. తద్వారా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. చివరికి ఊహించని విజయం దక్కి.. భారీ మెజారిటీ లభించింది.