Ekadashi Vratham 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తుంటాయి. ఏవైనా శుభకార్యాలు నిర్వహించాలన్నా.. కొత్త పనిని ప్రారంభించాలన్నా.. ఈరోజున సూచిస్తారు. కానీ సర్వ ఏకాదశి అన్ని ఏకాదశులు కలిపి ఉండే రోజు అని అర్థం. సర్వ ఏకాదశి రోజున పవిత్రత పాటిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండి మహావిష్ణువును సేవించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీనినే ఏకాదశి వ్రతం అంటారు. హిందు పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ముత్తయిదువలు లక్ష్మీనారాయణుడిని కొలవడం వల్ల ఆ స్వామి అనుగ్రహం తొందరగా పొందే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉపవాసంతో పాటు నియమ నిష్టలతో ఉండడం వల్ల ఆ స్వామి సంతోషిస్తాడని అంటున్నారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే ఈ ఏకాదశి వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఓ కథ ఉంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
పూర్వకాలంలో రత్నపురంలో పుండరీకుడు అనే రాజు పాలనలో లలిత అనే స్త్రీతో గంధర్వుడు సంతోషంగా ఉండేవాడు. ఒకసారి తన భార్య లేని కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతాడు. దీంతో గంధర్వుడు తన కార్యకలాపాలను సరైన విధంగా నిర్వహించలేకపోతాడు. అయితే తన బాధకు కారణమైన భార్యను శపిస్తాడు. నీ అందం నశించిపోవాలని శపిస్తాడు. దీంతో గంధర్వుడు భయంకరమైన రూపం పొందుతాడు. దీంతో బాధపడిన లలిత అడవిలోకి వెళ్తుంది. ఈమెకు ఒక రుషి కలుస్తాడు. దీంతో ఆమెకు ఏకాదశ వ్రతం గురించి వివరిస్తాడు. లలిత ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. దీంతో ఆమె భర్త అందమైన రూపాన్ని పొందుతాడు. చివరకు ఈ దంపతులు మోక్షం పొందుతారు.
ఏకాదశి ప్రతీ పక్షంలో ఒకసారి వస్తుంది. ఈరోజున వ్రతం చేయాలని అనుకున్న వారు ముందుగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలగాలి. ఏ రోజు అయితే వ్రతం చేయాలని అనుకుంటున్నారో.. ఆరోజు సూర్యోదయానికి ముందేనిద్ర లేవాలి. స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత శ్రీమన్నారాయణుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నిర్జల ఉపవాసం ఉండాలి. అంటే నీరు సహా ఏమీ తీసుకోకూడదు. అయితే ఇది సాధ్యం కాకపోతే పరిశుద్ధమైన ఆహారం అంటే.. పాలు, పండ్లు, డ్రై ప్రూట్స్, నాన్ గ్రెయిన్ వంటి పదార్థాలను తీసుకోవచ్చు.
ఏకాదశి వ్రతంను మహిళలు తమ సౌభాగ్యం బాగుండాలని చేస్తారు. అయితే మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ పరుష వ్యాఖ్యలు పలకరాదు. ఏలాంటి కోపతాపాలకు వెళ్లకుండా ఉండాలి. ఎక్కువగా నిద్రపోకుండా నిత్యం నారాయణస్మరణ చేస్తుండాలి.