HomeతెలంగాణKTR vs Journalist Shankar Interview: కేటీఆర్ కు జర్నలిస్ట్ శంకర్ బాధితురాలు సూటి ప్రశ్నలు

KTR vs Journalist Shankar Interview: కేటీఆర్ కు జర్నలిస్ట్ శంకర్ బాధితురాలు సూటి ప్రశ్నలు

KTR vs Journalist Shankar Interview: ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. విలేకరులు అంటే ఒక పార్టీకి డబ్బా కొట్టి.. నాయకులకు చెంచాగిరి చేసేవారిగా మారిపోయారు. ఇక ఆయా మీడియా యాజమాన్యాలు రాజకీయ పార్టీల మాదిరిగానే రంగులు పూసుకుంటున్నాయి. నేతల మాదిరిగానే వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో స్వయం ప్రకటిత పాత్రికేయులు పెరిగిపోయారు. వాస్తవానికి ప్రజలు అనుకుంటున్నది.. ప్రజలు భావిస్తున్నది కాకుండా.. వారి సొంత అజెండాను.. సొంతంగా మాట్లాడుతున్న మాటలను వార్తల్లాగా చెప్పడం మొదలుపెట్టారు. ఏదో ఒక రాజకీయ పార్టీని భుజాన మోస్తూ.. కొంతమంది నాయకులకు భజన చేస్తూ.. మిగతా వారి మీద బురద చల్లుతున్నారు. అంతేకాదు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంప్రకటిత జర్నలిస్టులు మరింత పెరిగిపోయారు. వీరిలో చాలామంది గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం విశేషం. పైగా వీరిని పాత్రికేయులు అని గులాబీ పార్టీ నాయకులు పదే పదే సంబోధించడం గమనార్హం.

Also Read: Kavitha Andhra Comments: మళ్లీ ఆంధ్రాపై అక్కసు.. స్వరాష్ట్రం సిద్ధించినా రాజకీయమేనా?

వాస్తవానికి పాత్రికేయులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తుంది. కానీ యూట్యూబ్లో వార్తలు చదివే సో కాల్డ్ జర్నలిస్టులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవు. పైగా వీరు పాత్రికేయులమని చెప్పుకుంటారు. మా పార్టీని ఇష్టానుసారంగా తిట్టడంలో ముందుంటారు. గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడటంలో.. అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఈ జాబితాలో జర్నలిస్టు శంకర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు చేసే వ్యాఖ్యలు.. మాట్లాడే మాటలు గులాబీ పార్టీకి దగ్గరగా ఉంటాయి. వాస్తవానికి ఇతడు మాట్లాడినట్టు గులాబీ కార్యకర్త కూడా మాట్లాడలేడు. పైగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఇతడి తర్వాతే ఎవరైనా . ఇతడు ఏ స్థాయిలో విద్వేషాలు రగిలించే విధంగా వ్యాఖ్యలు చేస్తాడో అతని ట్విట్టర్ ఖాతా చూస్తే తెలుస్తుంది. గతంలో ఇతడు ఆడపిల్లలను మోసం చేసిన ఘటనలో వారి చేతిలో తన్నులు కూడా తిన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తోంది..

Also Read: Congress local leaders: సంస్థగత ఎన్నికలతో పార్టీ ప్రక్షాళనకు రంగం సిద్ధం

ఇక తాజాగా ఓ యువతి తెరపైకి వచ్చింది. తనపై అడ్డగోలుగా శంకర్ తన పిడిఎఫ్ పేపర్లో వార్తలు రాయిస్తున్నాడని.. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని ఆరోపించిందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ఇటీవల పోలీసులు శంకర్ ను అరెస్టు చేస్తే.. కేటీఆర్ బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారని.. అటువంటి వ్యక్తికి కేటీఆర్ బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఆ యువతి ప్రశ్నించింది. తన జీవితాన్ని శంకర్ నాశనం చేశాడని.. ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాడని.. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువతి వాపోయింది. “ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై శంకర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఏకవాక్య సంబోధనతో విమర్శలు చేస్తున్నాడు. అయితే అతని తీరును ప్రశ్నిస్తూ ఓ యువతి తెరపైకి రావడం.. విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రతిపక్ష పార్టీలో ఉన్న కేటీఆర్ ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular