KTR Reveals Sensational Video: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల తారక రామారావు కీలకమైన వ్యక్తి. సిరిసిల్ల శాసనసభ సభ్యుడిగా, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. గతంలో పురపాలక శాఖ మంత్రిగా, సమాచార, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన పని చేశారు.. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడటంలో కల్వకుంట్ల తారక రామారావు దిట్ట. కల్వకుంట్ల తారక రామారావు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన మాదకద్రవ్యాలు తీసుకుంటారని.. అటువంటి వ్యక్తులతో ఆయనకు స్నేహం ఉందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైట్ పేపర్ ఛాలెంజ్ కు రావాలని సవాల్ కూడా విసిరారు. అది అప్పట్లో తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దానిపై కల్వకుంట్ల తారకరామారావు స్పందించినప్పటికీ.. తన శరీరం నుంచి నమూనాలు ఇవ్వకుండా కోర్టు దాకా వెళ్ళినట్టు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు.
ఇప్పటికీ అవకాశం దొరికితే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి మాదకద్రవ్యాల విమర్శలు చేస్తుంటారు. ఆ మధ్య శాసనసభలో సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్.. పేరు ప్రస్తావించకుండానే మాదకద్రవ్యాల ఆరోపణలు చేశారు. మాదకద్రవ్యాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ అనే బృందాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఈగల్ బృందం తనిఖీలు నిర్వహించింది. చాలామంది మాదకద్రవ్యాల గ్రహీతలను అరెస్టు చేసింది.. ఇన్ని రకాలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తొలిసారిగా తనపై వస్తున్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
Also Read: ఈటల – బండి ఎపిసోడ్ పై అధిష్టానం మౌనం.. ఎందుకో..?
ఓయూ జాతీయ ఆంగ్ల ఛానల్ తో ఆయన ముఖాముఖి మాట్లాడారు..” నా పిల్లలతోటి చెబుతున్న. నేను ఇంతవరకు ధూమపానం చేయలేదు. మాదకద్రవ్యాలు తీసుకోలేదు. అసలు వాటి వాసన ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు వాటిని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు వాటిని నేను ఎందుకు తీసుకుంటాను. నా ప్రత్యర్ధులు అనవసరంగా నామీద విమర్శలు చేస్తున్నారు. అసలు నాకు వాటిని తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను చదువుకున్న వ్యక్తిని.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తిని. అటువంటి స్థాయి ఉన్న నేను మాదకద్రవ్యాలు తీసుకుని చేసేది ఏముంటుంది.. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఆమాత్రం నాకు తెలియదా. నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. వారు చేస్తున్న ఆరోపణల వల్ల నా కుటుంబం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా నేను చెబుతున్నాను.. అలాంటి విమర్శలు సరికాదు. అలాంటి ఆరోపణలు కూడా సరికావు. ఇలా ఏవేవో వాటి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని” భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు హెచ్చరించారు. మొత్తంగా తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన వీడియోను భారత రాష్ట్ర సమితి సామాజిక అనుసంధాన బృందాలు తెగ వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వీడియోను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మాదకద్రవ్యాలు తీసుకోని పక్షంలో రక్త నమూనాలు, ఇతర శరీర నమూనాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
నా పిల్లల మీద ఒట్టు వేసి చెబుతున్న… KTR
నా జీవితం మొత్తంలో ఇప్పటి వరకు సిగరెట్ తాగలేను.. నా పిల్లల మీద ఒట్టు వేసి చెప్తాను నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు. pic.twitter.com/uTKCqlhJtt
— Vijaya Reddy (@VijayaReddy_R) July 21, 2025