Homeలైఫ్ స్టైల్Beauty Tips: అందంగా మారాలని అనుకుంటున్నారా? డబ్బు ఖర్చు లేకుండా ఈ పని చేయండి..

Beauty Tips: అందంగా మారాలని అనుకుంటున్నారా? డబ్బు ఖర్చు లేకుండా ఈ పని చేయండి..

Beauty Tips: ఆడవారు అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందంతోనే ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే నేటి కాలంలో మగవారి కూడా ఆడవారని ఆకర్షించేందుకు అందంగా తయారవ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొందరు కొన్ని కారణాలవల్ల అందంగా లేకున్నా.. బ్యూటీ పార్లర్ లకు వెళ్లి ప్రత్యేకంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆపరేషన్లు కూడా చేయించుకుంటున్నారు. ఇలా కాకుండా కేవలం కొన్ని ఆధ్యాత్మిక క్రియల వల్ల అందంగా తయారయ్యే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. ఏడాది పాటు ఒక పని చేయడం వల్ల మన్మధుడిలా తయారయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరి అలా కావడానికి ఏం చేయాలి..? ఏం తినాలి?

మనం తినే ఆహారాన్ని బట్టి కూడా అందంగా తయారవుతూ ఉంటారు. సినిమాల్లో నటించే కొందరు నటులు కేవలం సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అందుకు కారణం తాము నాజుగ్గా ఉండాలనే.. అయితే రోజు అలా కాకుండా నెలలో రెండు రోజులు పాటు ఈ ఆహారాన్ని తీసుకుంటే.. ఏడాది తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువగా అందంగా తయారయ్యే అవకాశం ఉంది.

ప్రతి నెలలో రెండు విదియ లో వస్తాయి. వీటిలో ఒకటి శుక్లపక్షం విదియ. మరొకటి కృష్ణపక్షం విదియ. ఈ రెండు రోజుల్లో ఉదయం, సాయంత్రం ఉప్పుడు పిండి తీసుకొని కేవలం పాలు తాగి నిద్రించాలి. ఇలా నెలకు రెండుసార్లు.. ఏడాదికి 24 సార్లు ఈ ఆహారం తీసుకోవడం వల్ల అందంలో తప్పకుండా మార్పు చూస్తారని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆహారం తీసుకున్న తర్వాత ఓం అశ్విని దేవతాయ నమః.. అంటూ 108 సార్లు మంత్రం జపించాలి. ఇలా ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకున్న సమయంలో చదవాలి. పూర్వకాలంలో ఆడవారు, ఇలాగే తినేవారు. దీనిని తీసుకోవడం వల్ల కచ్చితంగా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Also Read: Parenting Tips: డబ్బు గురించి మీ పిల్లలకు ఈ విషయాలు తప్పక చెప్పాలి..

అయితే పెళ్లి కావాల్సినవారు.. అందంగా తయారు కావాలని అనుకునేవారు ఈ పని చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటున్నారు. అందంగా తయారు కావడానికి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నెలలో రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా రెండు రోజులపాటు ఆహారాన్ని తగ్గించడం ద్వారా జీర్ణక్రియ కూడా పెంపొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రెండు సార్లు అశ్విని మంత్రం జపించడం వల్ల ఆ దేవతలు కరుణిస్తారని చెబుతున్నారు.

అందానికి ప్రతిరూపమైన అశ్వనీ దేవతలు తమను కొలవడం వల్ల భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తారని చెబుతారు. అలాగే ఇలా ఆహారం తీసుకొని చేయడం వల్ల కూడా అందాన్ని ఇస్తారని పేర్కొంటున్నారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరు అందంగా తయారవ్వాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రకారంగా ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతూ మనిషి రూపం కూడా మారుతుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version