spot_img
HomeతెలంగాణKTR: ఎంతలో ఎంత మార్పు.. కానీ అదే ప్లేసు.. ఇన్‌స్టాలో కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్

KTR: ఎంతలో ఎంత మార్పు.. కానీ అదే ప్లేసు.. ఇన్‌స్టాలో కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్

KTR: తెలంగాణ ఉద్యమనేత.. బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వారసుడిగా కల్వకుంట్ల తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో 2008లో పోటీ చేసి సిరిసిల్ల నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత నుంచి తన సొంతంగా ఇమేజ్‌ పెంచుకుని ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారచడమే లక్ష్యంగా పనిచేశారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రభాగానికి తీసుకెళ్లారు. పలు ఐటీ ఐటీ శ్రమలతోపాటు వివిధ పరిశ్రమలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దీంతో యువత, ఐటీ నిపుణులకు కేటీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఇక కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. మంచి అయినా.. చెడు అయినా సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటారు. ఇలా నెటిజన్లకూ కేటీఆర్‌ దగ్గరయ్యారు. లక్షల మంది ఫాటోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లోనూ కేటీఆర్‌ యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్‌ తాజాగా తన పాత ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. దీనిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.

20 ఏళ్ల క్రితం అంటూ..
సమాజంలో జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తూ.. చర్చిస్తుంటారు. అంతేకాకుండా.. అభిమానులకు కూడా రెగ్యూలర్‌గా రిప్లై ఇవ్వడం.. మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను సైతం ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్‌.. తన అరుదైన ఫొటోను పంచుకున్నారు. తాజాగా పోస్టు చేసిన పొటో 2002 లో లండన్‌లో తీసుకున్న ఫొటో అని తెలిపారు. దానితోపాటు 2022లో దిగిన ఫొటోను కూడా పోస్టు చేశారు. 2002లో లండన్‌లోని ఓ టెలిఫోన్‌ బూత్‌లో నిల్చున పొటో.. 2022లో ఓ టెలిఫోన్‌ బూత్‌లో నిల్చున ఫొటోను పోస్టు చేశారు. 20 ఏళ్ల క్రితం ఇలా.. ఇప్పుడు ఇలా అని క్యాప్షన్‌ పెట్టారు. 2002 నాటి ఫొటోలో నూనూగు మీసాలతో బ్లేజర్‌ వేసుకుని ఫార్మల్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను బట్టి చూస్తే.. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోనిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెట్టింట్లో వైరల్‌..
ఇంకేముంది.. కేటీఆర్‌ ఫొటో షేర్‌ చేసిన నాటినుంచి నెట్టింట వైరల్‌ గా మారింది. కాగా.. కేటీఆర్‌.. తెలంగాణ ఉద్యమం కంటే ముందు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

పదునైన మాటలు..
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తన పదునైన మాటలతో ప్రత్యర్థుల మాటలకు చెక్‌ పెట్టే మంచి వాగ్దాటి కేటీఆర్‌ సొంతం. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని.. అధికారం వరకు.. అధికారం నుంచి ప్రతిపక్షం వరకు.. ప్రాంతం ఏదైనా.. ఏ వేదికైనా అనర్గళంగా మాట్లాడుతారు. మాస్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌గా పేరు పేరుతెచ్చుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version