Sheetal Devi : కాలినే విల్లుగా.. మన శీతల్ దేవిని చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టి చూసింది..

దేవుడిచ్చిన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా.. కొంతమంది క్రీడాకారులు పూర్తిస్థాయిలో రాణించలేరు. కానీ శీతల్ దేవి అలా కాదు.. ఆమెకు వైకల్యం ఉంది. కాకపోతే లక్ష్యానికి అడ్డు కాలేదు. తన ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోక తప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 5:36 pm

Sheetal Devi

Follow us on

Sheetal Devi : పారిస్ వేదికగా పారాలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ పోటీలలో మన దేశానికి చెందిన 17 సంవత్సరాల శీతల్ దేవి ఆర్చరీలో అద్భుతమైన ప్రదర్శన చూపించింది. పాయింట్ తేడాతో మెడల్ కోల్పోయినప్పటికీ.. ఆమె ప్రదర్శన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ పోటీపడింది. తొలి షాట్ లో ఆమె ఏకంగా 10 పాయింట్లు గురిపెట్టి కొట్టేసింది. ఆమె కొట్టిన షాట్ కు సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ఆ షాట్ చూసి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, బార్సి లోనా ఫుట్ బాల్ ఆటగాడు జౌలెస్ కుందె ఫిదా అయిపోయారు. ఇది ఆశ్చర్యానికి గురి చేసే ప్రదర్శన అంటూ అభినందనలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్చర్లలో కొద్దిమంది మాత్రమే ఆర్మ్ లెస్ గా ఉన్నారు. అందులో మన శీతల్ ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏకంగా కాలితోనే విల్లు ఎత్తింది. పది పాయింటులకు గురిపెట్టి కొట్టేసింది. ఇది ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.

కాళ్లతోనే రంగంలోకి దిగింది

శీతల్ తాను పోటీ పడిన విభాగంలో తన కాళ్లతోనే రంగంలోకి దిగింది.. ఆమె ప్రత్యర్థి వీల్ చైర్ చేతులతోనే బాణాన్ని విసిరింది. శీతల్ గుడికి సంబంధించిన వీడియోను.. కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శేఖర్ దత్ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. దానికి శీతల్ ధన్యవాదాలు తెలియజేశారు. “కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్తు కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నానని” శేఖర్ వ్యాఖ్యానించారు..”ఇది అసాధ్యమని నేను అనుకోను. ఇది నమ్మశక్యంగానే ఫీట్. ఇలాంటివి చేయాలంటే గుండె ధైర్యం కావాలి. అది శీతల్ కు మెండుగా ఉంది. ఆమె తన కాలునే విల్లుగా చేసుకుంది. అసలు ఆర్మ్ లేకుండా శీతల్ జన్మించింది. ఏకంగా హీరోగా అవతరించింది. ఒక పోరాటానికి ఇది నిజమైన నిదర్శనం అని” ఎరిక్ సోల్హెమ్ వ్యాఖ్యానించాడు.. “పారాలింపిక్స్ లో అందరూ అథ్లెట్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఇందులో ఎవరి ప్రదర్శనా ఎక్కువ కాదు. ఇంకొక దర్శన తక్కువ కాదు. అందరూ ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు.. అయితే వీరంతా తమలో ఉన్న ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. శీతల్ ప్రదర్శన చూస్తే వెన్నులో వణుకు పుట్టింది. వైకల్యాన్ని అధిగమించడం అంత సులభం కాదు. కాకపోతే శీతల్ దానిని చేసి నిరూపించింది.. ఇది చాలా గొప్ప విషయమని” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా, శీతల దేవి ప్రదర్శన పట్ల మాజీ క్రీడాకారులు స్పందిస్తున్నారు. ఆమె పారిస్ వేదికగా మన దేశ ప్రతిష్టను రెపరెపలాడించిందని కొనియాడుతున్నారు. మెడల్ రాకపోయినప్పటికీ ఆమె భారత దేశానికి అద్భుతమైన ఔన్నత్యాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.