KTR padayatra: ఏ పార్టీ నేత పాద యాత్ర చేసే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఖాయం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పదేళ్ల టీడీపీని గద్దెలోకి దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్ తనయుడు జనగ్ కూడా పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంటు కొనసాగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు.
2027లో జనంలోకి..
2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్ ప్రకటించారు. గతంలో కూడా చెప్పాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. తాజాగా ‘‘ఈలోపు ఫిట్ అవుతాను’’ అని చెప్పుతూ, పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం లక్ష్యంగా ఈ పాదయాత్రం ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్కు ప్రజల మధ్య ఒక దూరం ఏర్పడిందని. ఇది చాలా ముఖ్యమైన అంగీకారం. ఎందుకంటే, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలనా యాంత్రికత, అధికార దూరం వల్ల గ్రామీణ–ప్రజా స్థాయి సంబంధాలు బలహీనపడతాయి. బీఆర్ఎస్ ఈ వాస్తవాన్ని అంగీకరించి, పాదయాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా బాధ్యతావంతమైన వైఖరి.
ఏ పార్టీ నేత పాద యాత్ర చేసే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఖాయం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పదేళ్ల టీడీపీని గద్దెలోకి దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్ తనయుడు జనగ్ కూడా పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంటు కొనసాగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు.
2027లో జనంలోకి..
2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్ ప్రకటించారు. గతంలో కూడా చెప్పాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. తాజాగా ‘‘ఈలోపు ఫిట్ అవుతాను’’ అని చెప్పుతూ, పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం లక్ష్యంగా ఈ పాదయాత్రం ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్కు ప్రజల మధ్య ఒక దూరం ఏర్పడిందని. ఇది చాలా ముఖ్యమైన అంగీకారం. ఎందుకంటే, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలనా యాంత్రికత, అధికార దూరం వల్ల గ్రామీణ–ప్రజా స్థాయి సంబంధాలు బలహీనపడతాయి. బీఆర్ఎస్ ఈ వాస్తవాన్ని అంగీకరించి, పాదయాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా బాధ్యతావంతమైన వైఖరి.
పాదయాత్రలు శక్తివంతమైన సాధనమే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ వరకు అనేక నాయకులు పాదయాత్రల ద్వారా తమ రాజకీయ జీవితాల్లో కీలక మలుపులు తిప్పుకున్నారు. కేటీఆర్ కూడా ఇప్పుడు అదే మార్గం ఎంచుకోవడం ఆయన ఇమేజ్ను ‘హై–టెక్, అర్బన్ నాయకుడి’ నుంచి ‘ప్రజా నాయకుడి’గా మార్చుకోవాలన్న తపనను సూచిస్తోంది. కేటీఆర్ మరో ముఖ్యమైన విషయం స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎలాంటి కూటములు లేవని. ఇది ఒకవైపు ధైర్యవంతమైన నిర్ణయం కాగా, మరోవైపు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఆఖకి పెద్ద సవాలు కూడా. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్కు అవకాశం ఇస్తున్నప్పటికీ, పార్టీ సంస్థాగత బలం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా కేడర్‌ను పునరుజ్జీవింపజేయడం, కొత్త నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం అత్యంత కీలకం.
కేటీఆర్ పాదయాత్ర విజయవంతమైతే, అది బీఆర్ఎస్ను మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ఆప్షన్‌గా నిలబెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ ఉన్న సానుభూతిని మళ్లీ సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు. అయితే, పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు. దాని వెనుక స్పష్టమైన అజెండా, ప్రజల సమస్యలపై నిజమైన దృష్టి, స్థిరమైన సందేశం ఉండాలి. లేనప్పుడు ఇది ఒక ఏడాది ముందు ఎన్నికల డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2027లో ఆయన పాదయాత్ర ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాను
– కేటీఆర్ pic.twitter.com/74HdVIlcMe
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026