KTR: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు పగలు, ప్రతీకారాలతో సాగుతున్నాయి. ఎంతలా అంటే గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి లోలోపల రగిలిపోతూ తనను విస్మరించిన వారికి షాకులు ఇస్తూనే ఉన్నారు. హైడ్రా అంటూ కాంగ్రెస్ కు ఓటేయని హైదరాబాదీలపై పడిపోయారని బీఆర్ఎస్ వాళ్లు ఆరోపించారు. ఇక పేరు మరిచిపోయారని నాగార్జున, అల్లు అర్జున్ లను టార్గెట్ చేశారని అంటున్నారు. ఇక అంతిమంగా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.. రేవంత్ తో నేరుగా ఫైట్ కు కేటీఆర్ రెడీ అయిపోయాడు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A1గా కేటీఆర్‌గా ఉన్నారని, మరో రెండు రోజుల్లో కేటీఆర్‌ను అరెస్ట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. అసలు కరెప్షన్ జరగలేదు.. కానీ ఏసీబీ కేసు ఎందుకు నమోదు చేసిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వం కావాలనే కుట్రతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని, చేయని తప్పుల కేసులో ఇరికిస్తుందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే రేస్ నిర్వాహకులు వెనక్కి వెళ్లిపోయారని, ఇండియా పరువు తీశారని కేటీఆర్ అన్నారు. మా వెంట్రుక కూడా పీకలేవన్నారు. ఏ తప్పు చేయకపోయిన కూడా అరెస్ట్ చేస్తానంటే చేసుకో.. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కవ అని తెలిపారు. మీ రహస్యాలు అన్ని బయట పెట్టినందుకే ఇలా చేస్తున్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
కారు రేసు విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని, కావాలనే కాంగ్రెస్ పార్టీ భూతద్దంలా చూసి పెద్దది చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఇండియాలో పర్మినెంట్ రేసింగ్ కోసం మాత్రమే హైదరాబాద్ సిటీని ఎంచుకున్నారన్నారు. కారు రేసు నిర్వహించడం కోసం గోపన్‌పల్లిలో భూసేకరణ చేపట్టారని, భూమి ఇవ్వాలని ఇప్పటికీ రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కారు రేస్ చాలా ఫేమస్ అని.. ప్రపంచం మొత్తం కూడా దీని వైపు చూస్తోందని తెలిపారు. భారీ ఆదరణ పొందిన ఈ కారు రేస్‌ను మిలియన్ల మంది చూస్తారని, గతంలో జేపీ గ్రూప్ రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి ఇండియాకి తెచ్చిందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇండియాలో ఎక్కడ కూడా జరగలేదన్నారు. ఈ కారు కోసం పెట్టుబడులు పెట్టాలని తమ పార్టీ నిర్ణయించుకుందని, ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్‌లో భాగమని తెలిపారు. ప్రపంచంలో హైదరాబాద్ నగరం ఎలక్ట్రిక్ వెహికల్ వాడే విధంగా టాప్‌లో ఉంచాలని భావించాం. ఆ కారణంతోనే ఈ కారు రేసుకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కారు రేసు ఈవెంట్‌ను 190 దేశాలు కూడా చూశాయని కేటీఆర్ అన్నారు.
ఈ కారు రేసు నిర్వహణ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే గ్రీన్ కో స్పాన్సర్ దాదాపుగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ రేసు వల్ల హైదరాబాద్‌కి దాదాపుగా 82 మిలియన్ డాలర్ల్ ఎకానామికి బెన్ ఫిట్ వచ్చినట్లు నెల్సన్ సంస్థ రిపోర్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు. రూ.150 కోట్లు పెడితే 82 మిలియన్ డాలర్లు అంటే 700 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అంటే దాదాపుగా రూ.550 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లే అని తెలిపారు. మళ్లీ గవర్నమెంట్ వస్తుందని అప్పుడు టెస్లాను కూడా హైదరాబాద్‌కు తీసుకురావాలని ప్లాన్ చేశామని కేటీఆర్ అన్నారు. కానీ అనూహ్యంగా తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డితో కేటీఆర్ ఫైట్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది.