https://oktelugu.com/

Highway : పాన్‌ అమెరికా హైవే.. ప్రపంచంలో అత్యంత పొడవైనది.. 14 దేశాలమీదుగా వెళ్లొచ్చు! ప్రత్యేకతలివీ

పాన్‌ ఇండియా సినిమా అని ఇటవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఈ పాన్‌ ఇండియా, పాన్‌ అమెరికా.. పాన్‌ జపాన్‌.. ఇలాంటివి కొత్తగా వచ్చినవి కాదు. ఎక్కువ దేశాల్లో చూసేవాటిని పాన్‌ అంటారు. సినిమాలాగే పాన్‌ రహదారి కూడా ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 20, 2024 / 03:07 AM IST

    Pan America Highway

    Follow us on

    Highway : రవాణా మార్గాలు దేశ అభివృద్ధికి చిహ్నాలు. రోడ్డు, రైలు, విమాన, జల మార్గాలు ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. జల మార్గం ఉన్న కారణంగానే బ్రిటిషర్లు, ఫ్రెంచ్, డచ్‌వారు మన దేశానికి వచ్చారు. వందల ఏళ్లు పాలించారు. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు, రైలు మార్గాల అభివృద్ధి, కొత్త మార్గాల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. మన దేశంలో జాతీయ, రాష్ట్రయ, పంచాయతీ రోడ్లు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద హైవే – 44. దీని పొడవు 3,745 కిలోమీటర్లు. ఇది కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో ఇంతకన్నా పొడవైన రహదారి ఉంది. ఇది ఏకంగా 14 దేశాలను కలుపుతుంది. ఉత్తర, దక్షిణ అమెరికాను కలిపే ఈ హైవేను పాన్‌ అమెరికా హైవే అంటారు. ఇది అలస్కా నుంచి మొదలై అర్జెంటీనా వరకు ఉంటుంది. రెండు ద్వీపాలను కలిపే ఈ రహదారి నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది.

    ఇప్పటికీ అసంపూర్తిగానే..
    ఈ హైవేను 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రహదారి మొత్తం పొడవు 48,000 కి.మీ (30,000 మైళ్లు) 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్‌ గ్యాప్‌ అంటారు. ఇది పానామా కొలంబియా మధ్య ఉంది. ఈ డారియన్‌ గ్యాప్‌ కిడ్నాప్‌లు, డ్రగ్, ట్రాఫికింగ్, స్మగ్లింగ్‌కు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా విమానాల్లో వెళ్తున్నారు.

    ప్రయాణానికి ఎంత సమయం..
    రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే ఈ రోడ్డుపై ప్రయాణం 60 రోజుల్లో పూర్తి అవుతుంది. కార్లెస్‌ సాంటారియా అనే సైక్లిస్ట్‌ ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టి రికార్డు సృష్టించాడు. దీంతో అతని పేరు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నమోదయ్యింది.

    కండీషన్లు: పాన్‌–అమెరికన్‌ హైవే చాలా దేశాల నుంచి వెళ్లే ఈ మార్గం కొన్ని భాగాలలో అపూర్వమైన సహజ దృశ్యాలను చూపించడంతోపాటు వాణిజ్య రవాణా కూడా చేస్తుంది. కానీ, కొన్ని ప్రాంతాల్లో అది దారితప్పింది (ఉదా: డారియన్‌ గ్యాప్‌), అందువల్ల అక్కడ రోడ్డు లేదు.

    భౌగోళిక వైవిధ్యం..
    ఈ హైవే ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికా వరకు వెళ్ళడం వల్ల ఇది వివిధ భౌగోళిక ప్రాంతాలను, వాతావరణాలను, సంస్కృతులను చేరుతుంది.

    – పర్యాటకాలు..
    పాన్‌–అమెరికన్‌ హైవే యాత్రికులకు సాహస ప్రయాణాల కోసం కూడా ప్రసిద్దమైంది.

    పాన్‌ అమెరికా కలిపే 14 దేశాలు ఇవే..

    1. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా

    2. కెనడా

    3. మెక్సికో

    4. గ్వాటెమాల

    5. ఎల్‌ సల్వడార్‌

    6. హోండురాస్‌

    7. నికరాగ్వా

    8. కోస్టా రికా

    9.పనామా

    10.కొలంబియా

    11. ఈక్వెడార్‌

    12.పెరూ

    13. చీలీ

    14. అర్జెంటీనా