KTR Is Unable To Withstand Revanth: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ముఖ్యంగా రేవంత్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు నుంచే వీరి మధ్య ఫైర్ కొనసాగుతోంది. నిత్యం కేటీఆర్ రేవంత్‌పై మండిపడుతూనే ఉన్నారు. దానికి రేవంత్ కూడా అదే స్థాయిలో బదులిస్తూ వస్తున్నారు. ఇటు ట్విట్టర్‌లోనూ ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది.
ఇక.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వైఖరిపై మరోసారి ఆ పార్టీలోనే చర్చ మొదలైంది. కేటీఆర్ అసలు ఏం చేస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సిన కేటీఆర్.. కేవలం రేవంత్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం రేవంత్‌ను తప్పిస్తేనే కాంగ్రెస్ పని అయిపోతుందని కేటీఆర్ అనుకుంటున్నట్లున్నారు. అందుకే కేవలం రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌ను పక్కన పెడితే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. రేవంత్ పోతే కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధమని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ రేవంత్ తప్పకుంటే వెంటనే కాంగ్రెస్‌తో జతకట్టాలని కేటీఆర్ భావిస్తున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అందులోభాగంగానే కేటీఆర్ పదే పదే ట్వీట్లు చేస్తూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి కాంగ్రెస్‌తో దోస్తీకి ఓకే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నిత్యం కాంగ్రెస్ నేత రాహుల్‌కు ట్యాగ్ చేసి పార్టీ పరువు తీస్తున్నారని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ ఇమేజ్‌ను హైకమాండ్ వద్ద తక్కువ చేయాలనుకుంటున్న కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. మరోవైపు.. గాంధీభవన్‌లో గాడ్సే వారసుడు అంటూ కేటీఆర్ కూడా పదేపదే కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ వ్యాఖ్యల్ని బట్టి మరో విధంగా అర్థం చేసుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఒకే కానీ.. రేవంత్ మాత్రం గాడ్సే అయ్యారా అన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు.. కేటీఆర్ చేస్తున్న ప్రతీ ట్వీట్‌లోనూ కాంగ్రెస్‌ను కాపాడుకొచ్చే ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్పితే ఎక్కడా కాంగ్రెస్‌ను ఢీకొడుతున్నట్లుగా పెద్దగా అనిపించడం లేదు. నిత్యం రేవంత్‌ను తప్పుపడుతూ హైకమాండ్‌కు ట్వీట్ చేస్తున్న కేటీఆర్‌కు.. రేవంత్ ప్రాముఖ్యత హైకమాండ్‌కు ఆ మాత్రం తెలియదా..? ఆ మాత్రం ప్రియారిటీ లేకుండానే రేవంత్‌ను ముఖ్యమంత్రిని చేశారా..? ఇన్నాళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారా..? అన్నది ఆ మాత్రం కేటీఆర్‌కు ఎందుకు తెలియడం లేదు అన్నది అర్థం కాని పరిస్థితి. ఇక మొన్నటివరకు రేవంత్‌ను టార్గెట్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మీద పడినట్లుగా అర్థం చేసుకోక తప్పదు. ఇప్పటివరకు కేటీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ రేవంత్‌కు ప్లస్ అయ్యాయి తప్పితే ఏ మాత్రం మైనస్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ కుటుంబం ఏదో చేస్తుందంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోదరుడు, అల్లుడు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో పెద్దగా ఇబ్బంది కాదని, కేవలం రేవంత్‌తోనే వచ్చిన సమస్యల్లా అంటూ కేటీఆర్ భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు ఆయన ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.