https://oktelugu.com/

Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ వసూళ్లు..డిజాస్టర్ చిత్రాలలో ఆల్ టైం చెత్త రికార్డు!

వరుణ్ తేజ్ గత చిత్రాల ఫ్లాప్స్ ప్రభావం కారణంగా 'మట్కా' చిత్రంపై మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా వరుణ్ కెరీర్ లో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 5 వ రోజు సున్నా షేర్ ని దక్కించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 03:56 PM IST

    Matka Movie

    Follow us on

    Matka: మెగా హీరో వరుణ్ తేజ్ అదృష్టం ఈమధ్య అసలు బాగుండడం లేదు. పెళ్లి తర్వాత యంగ్ హీరోలందరికీ బాగా కలిసొచ్చింది. వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ వేరే లెవెల్ కి వెళ్తున్నారు. కానీ వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అది రివర్స్ లో జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయనకీ వస్తున్నా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు, మెగా ఫ్యామిలీ పరువు తీసే విధంగా ఉంటున్నాయి. కెరీర్ లో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్2, ఎఫ్3 వంటి సంచలనాత్మక చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వరుణ్ తేజ్ ఇతర మెగా హీరోలు లాగా మరో లెవెల్ కి వెళ్లలేకపోతున్నాడు. ప్రతీ సినిమా ఆడియన్స్ కి కొత్త రకమైన అనుభూతి కలిగించాలి అనే తపనతో ఆయన ప్రయోగాలు చేస్తూ డిజాస్టర్స్ ని కొని తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘మట్కా’ చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని తెచ్చుకుంది.

    కానీ వరుణ్ తేజ్ గత చిత్రాల ఫ్లాప్స్ ప్రభావం కారణంగా ‘మట్కా’ చిత్రంపై మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా వరుణ్ కెరీర్ లో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 5 వ రోజు సున్నా షేర్ ని దక్కించుకుంది. ఓవరాల్ గా 5 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కనీసం ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చులో పావు శాతం కూడా ఈ సినిమా కలెక్షన్స్ రూపం లో రాబట్టలేకపోయింది. ప్రాంతాలవారిగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో 67 లక్షల రూపాయిలు, కర్ణాటక, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడంతో, ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా 20 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. ఇప్పుడు దాదాపుగా క్లోజింగ్ పడిపోవడంతో నిర్మాతలకు బయ్యర్స్ కి అక్షరాలా 18 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది అన్నమాట. చిన్న సినిమా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతున్న ఈ రోజుల్లో , మట్కా చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వరుణ్ తేజ్ మంచి నటుడు, పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా సిద్దపడుతాడు. ప్రేక్షకులకు కొత్తదానం అందించేందుకు తపన చూపిస్తాడు. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. కాస్త గ్యాప్ తీసుకొని ఆ పొరపాటుని సరి చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఫ్లాప్స్ రాకుండా ఉంటాయి అనేది అభిమానుల అభిప్రాయం.