KTR : బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నించొద్దు.. కాంగ్రెస్ సర్కారులోనే ప్రశ్నించాలా.. కేటీఆర్ సార్?

సరిగ్గా ఆయన మాటల్లో చెప్పాలంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్లుంది పరిస్థితి అంటూ.. ఎకషేక నవ్వేసుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : May 19, 2024 1:58 pm

ktr-vs-revanth-reddy

Follow us on

KTR : బీఆర్ఎస్ సర్కార్ హయంలో ప్రజాస్వామ్య పరిఢవిల్లింపు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన..ఆయన వెంట ఉన్న అమాత్యులు.. వీరందరి కంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారనేది తెలంగాణ ప్రజలు బాగానే చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు బంద్..! రాస్తారోకోలు లేవ్..! ఇందిరా పార్క్ వద్ద ఆందోళనలకు అనుమతుల లేవ్..! హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రతీరోజు పోలీస్ 30 ఆక్ట్ అమలు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధితులు ఎవరన్నా చిన్న, చితకా ధర్నాలు చేస్తే చాలు వెంటనే అరెస్టులు చేయడమే. ఇది గత ప్రభుత్వంలో జరిగిన ప్రజాస్వామిక పరిపాలన.

అయితే ఇంతటి అద్భుతమైన పరిపాలన చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఆ పార్టీ తరఫున కేటీఆర్ ప్రజాస్వామ్య పాలన కోసం ప్రశ్నిద్దాం అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ స్టేట్మెంట్లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చారు. మొదటిసారి ఆ పార్టీకి బోటా బోటి మెజార్టీ వచ్చినప్పటికీ.. రెండో దఫా మాత్రం స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టారు. అయితే బీఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ దాటి మ్యాండెట్ వచ్చినప్పటికీ..ఆ పార్టీ అధినేత కెసిఆర్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలోనే ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేతలపై అప్పట్లో పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చాయి. పార్టీలోని కొందరు కీలక నేతలు కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై అప్పట్లో కెసిఆర్ వద్ద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే స్వంత పార్టీ నేతలు,సన్నిహితుల ఒపీనియన్స్ కూడా కెసిఆర్, కేటీఆర్ అసలే లెక్క చేయలేదు. సొంత పార్టీకి సంబంధించిన నేతల దగ్గర కూడా కెసిఆర్,కేటీఆర్ కనీస రాజకీయ విలువలను పాటించలేకపోయారు.

ఇప్పుడు అలాంటి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రశ్నించే గొంతులు కావాలని.. పోరాట యోధులు కావాలని స్టేట్మెంట్లు ఇస్తుండడం నవ్వులు తెప్పిస్తోంది. కేటీఆరేనా ఇలా మాట్లాడేది అంటూ.. మెజార్టీ పబ్లిక్ ఆయన సెటైర్లు వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవడానికే ఆయనకు ప్రశ్నించే తత్వం గుర్తొస్తుందా…? అంటూ..విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా ఆయన మాటల్లో చెప్పాలంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్లుంది పరిస్థితి అంటూ.. ఎకషేక నవ్వేసుకుంటున్నారు.