https://oktelugu.com/

Salaar 2: సలార్ 2 షూటింగ్ పై వీడిన సస్పెన్స్…గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్…

ప్రభాస్ కూడా ఈ సినిమా మీద తన డేట్స్ ను కేటాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 19, 2024 / 01:51 PM IST

    Salaar 2

    Follow us on

    Salaar 2: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ చాలా తక్కువ సమయం లోనే యంగ్ రెబల్ స్టార్ గా తన స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా తన సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక జూన్ 27 న ‘కల్కి ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం చివర్లో వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక దానికి సీక్వెల్ గా సలార్ 2 సినిమా కూడా రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక దానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటూ చాలామంది ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లైతే చేస్తున్నారు. మరి వీటన్నింటి పట్ల క్లారిటీ దొరికే సమయమైతే వచ్చింది. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తొందరగా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా గత కొద్దీ రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా మీద తన డేట్స్ ను కేటాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కాబట్టి సలార్ 2 సినిమాకి 2025 సమ్మర్ నుంచి డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సలార్ 2 సినిమాలో స్టోరీ అద్భుతంగా ఉంటుందనేది సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

    ఎందుకంటే సినిమా స్టోరీ అంతా కూడా సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుంది అనేది…